‘పెద్ది’ విజయం.. వీరికి చాలా కీలకం | Peddi Movie Success In Very Crucial For These People | Sakshi
Sakshi News home page

‘పెద్ది’ విజయం.. వీరికి చాలా కీలకం

Jun 3 2026 2:31 PM | Updated on Jun 3 2026 2:59 PM

Peddi Movie Success In Very Crucial For These People

మరికొన్ని గంటల్లో పెద్ది(Peddi) మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.పెద్దితో టాలీవుడ్‌కి పెద్ద విజయం వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విజయంపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. కొంతమందికి అయితే ఈ సినిమా విజయం చాలా అవసరం.

 వారిలో మొదటి వరులో ఉన్నది హీరో రామ్‌ చరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత భారీ అంచనాతో వచ్చిన గేమ్‌ ఛేంజర్‌ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా మారింది. ఇప్పుడు రామ్‌ చరణ్‌ ఆశలన్నీ పెద్ది పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయంపైనే చరణ్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పెద్ది సూపర్‌ హిట్‌ అయి భారీ కలెక్షన్స్‌ తీసుకొస్తే.. పాన్‌ ఇండియా మార్కెట్‌లో చరణ్‌ వ్యాల్యూ పెరిగిపోతుంది. అతని పారితోషికం పెరగాలన్నా.. పాన్ ఇండియా స్టార్స్‌తో పోటీలో నిలవాలన్నా పెద్ది విజయం చరణ్‌కు చాలా అవసరం.

ఇక దర్శకుడు బుచ్చిబాబుకు కూడా పెద్ది హిట్‌ అత్యంత కీలకమనే చెప్పాలి. ఉప్పెన లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌ తీసుకొని ఈ సినిమా తెరకెక్కించాడు. రెండో సినిమాకే రామ్‌ చరణ్‌ లాంటి స్టార్‌ హీరోతో సినిమా చేయడం బుచ్చిబాబు అదృష్టం అని చెప్పాలి. అయితే ఈ సినిమా విజయం సాధిస్తేనే బుచ్చిబాబు కెరీర్‌ బాగుంటుంది. తర్వాత కూడా వరుసగా స్టార్‌ హీరోలతో సినిమా చేసే అవకాశాలు వస్తాయి. బోల్తా పడితే మాత్రం ఆ నింద ఎక్కువగా బుచ్చిబాబుపైనే పడుతుంది. ఆయన కెరీర్‌కి ఈ సినిమా చాలా కీలకం.

వీరితో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌కి కూడా పెద్ది హిట్‌ చాలా అవసరం. దేవరతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా..తొలి సినిమాలో నటనకు పెద్దగా స్కోప్‌ దొరకలేదు. తెరపై కనిపించింది కూడా చాలా తక్కువే. పెద్దిలో అచ్చియమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలనుకోంటోంది. సినిమా హిట్‌ అయితేనే ఆమె పాత్రకు తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇక నిర్మాత వెంకట సతీష్‌కి కూడా పెద్ది విజయం చాలా కీలకం. ఆయన నిర్మాతగా చేసిన తొలి సినిమా ఇది. దాదాపు రూ. 350 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. ఓ రకంగా ఇది పెద్ద సాహసమనే చెప్పాలి. చరణ్‌ సినిమా కాబట్టి హిట్‌ టాక్‌ వస్తే.. కలెక్షన్స్‌తో పాటు నిర్మాతగా మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఇలా భారీ ఆశలతో వస్తున్న పెద్ది సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement