రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లుతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ సాధించింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజైన 9 రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల మార్కును దాటింది. ఈ వసూళ్లతో ఈ ఏడాదిలోనే దక్షిణాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.
ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, రెజ్లర్‌గా, రన్నర్‌గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించింది. అయితే జాన్వీ రోల్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్‌ను మేకర్స్ తొలగించారు.
కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
#Peddi is SOUTH INDIA'S NO.1 GROSSER OF 2026 🔥🔥
Collects a gross of over 366 CRORES WORLDWIDE in 9 days ❤🔥
🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/hVo5QJIBaQ— PEDDI (@PeddiMovieOffl) June 13, 2026


