రామ్ చరణ్ పెద్ది.. పూనకంతో స్టెప్పులేసిన మహిళ అభిమాని..! | Ram Charan Fan Dance at Peddi Movie Screemning In Theatre video viral | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది మూవీ.. థియేటర్ దద్దరిల్లేలా మహిళ అభిమాని డ్యాన్స్..!

Jun 4 2026 3:27 PM | Updated on Jun 4 2026 3:34 PM

Ram Charan Fan Dance at Peddi Movie Screemning In Theatre video viral

రామ్ చరణ్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 3న ప్రీమియర్స్‌తో మొదలైన పెద్ది హవా.. మొదటి రోజే ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. అభిమానులు సూపర్ హిట్ అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఓ  మహిళ అభిమాని ఏకంగా థియేటర్‌లోనే డ్యాన్స్‌ చేస్తూ అలరించింది. రైరై రారా అంటూ సాగే పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులతో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ అద్భుతంగా డాన్స్ చేోశావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రెండుసార్లు వాయిదా పడినా ఈ చిత్రం టాక్సిక్ తప్పుకోవడంతో జూన్ 4న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించింది. కోలీవుడ్ భామ శృతిహాసన్ సైతం ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement