రామ్ చరణ్‌ని సర్‌ప్రైజ్ చేసిన కూతురు | Ram Charan House Workers Dance Peddi Song And Daughter Wishes | Sakshi
Sakshi News home page

Peddi Movie: 'పెద్ది' మేనియా.. చరణ్ ఇంట్లో పనివాళ్లు డ్యాన్స్

Jun 6 2026 6:16 PM | Updated on Jun 6 2026 7:44 PM

Ram Charan House Workers Dance Peddi Song And Daughter Wishes

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా థియేటర్లలో ఉంది. మిక్స్‌డ్ టాక్ రావడంతో తెలుగులో మాత్రమే కలెక్షన్స్ వస్తున్నాయి. మిగిలిన భాషల్లో తేలిపోయింది. కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం 'పెద్ది' మేనియా కనిపిస్తోంది. రామ్ చరణ్ కూతురే స్వయంగా తండ్రికి విషెస్ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)

'దిస్ ఈజ్ ఫర్ యూ నాన్న, లవ్ యూ సో మచ్' అని క్లీంకార ముద్దుమాటలతో ప్రారంభమైన వీడియోలో.. చరణ్-ఉపాసన ఇంట్లోని పనివాళ్లంతా కలిసి చికిరి చికిరి పాటకు డ్యాన్స్ చేశారు. చివరకు చరణ్ సెక్యూరిటీ గార్డ్‌తోనూ వైరల్ బ్యాట్ స్టెప్ వేయించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో రామ్ చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించాడు. చరణ్ అద్భుతంగా నటించాడు. ఏఆర్ రెహమాన్ కూడా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. జాన్వీ కపూర్ సీన్ల వల్ల ఘోరమైన నెగిటివిటీ వస్తోంది. ఈ ‍క్రమంలోనే తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో సదరు సన్నివేశాలని తొలగిస్తామని చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు.. ప్రేక్షకులకు క్షమాపణ కూడా చెప్పాడు. రెండు రోజుల్లో రూ.181 కోట్ల గ్రాస్ కలెక్షన్ ఈ చిత్రానికి వచ్చాయి.

(ఇదీ చదవండి: 'రెబల్' విషయంలో ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement