'నా అసలు పేరు మర్చిపోతారేమో'.. రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ | Ram Charan Emotional Speech after Peddi Movie success meet | Sakshi
Sakshi News home page

Peddi Movie: 'నా అసలు పేరు మర్చిపోతారేమో'.. రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్

Jun 23 2026 10:09 PM | Updated on Jun 23 2026 10:15 PM

Ram Charan Emotional Speech after Peddi Movie success meet

రామ్ చరణ్ హీరోగా వచ్చిన మూవీ పెద్ది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో  మేకర్స్
నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు హాజరైన రామ్ చరణ్‌ ఎమోషనలయ్యారు. ఈ సినిమా నా లైఫ్‌ను మార్చేసిందని అన్నారు. ఇంత పెద్ది హిట్‌ ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మూవీలోని పాటలకు అందరూ డ్యాన్స్ చేస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తోందన్నారు. క్లీంకార ఇప్పుడు నన్ను పెద్ది అని పిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. మీరు కూడా నా పేరు మరిచిపోయి పెద్ది అని అంటారేమోనని అన్నారు. మా నాన్నతో నేను మాట్లాడలేని ఏదైనా ఉంటే డైరెక్టర్‌ సుకుమార్‌కు ఫోన్ చేస్తానని చెప్పారు.

తెలుగు ప్రజలు ఎవరినీ అంత ఈజీగా ఇష్టపడరు.. ఒక్కసారి ఇష్టపడితే గుండెల్లో పెట్టుకుంటారని రామ్ చరణ్ అన్నారు. మా పెద్ది సినిమాకు పాజిటివ్‌గా రివ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంతటి ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు మీ రామ్ చరణ్ ఎప్పటికీ రుణపడి ఉంటారంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement