పెద్ది మానియా.. చికిరి సాంగ్‌కు చిందులేసిన వరుడు | A Bridegroom Dance at his wedding ram charan Peddi chikiri Song | Sakshi
Sakshi News home page

Peddi Song: పెద్ది మానియా.. చికిరి సాంగ్‌కు చిందులేసిన వరుడు

Jun 12 2026 3:11 PM | Updated on Jun 12 2026 3:20 PM

A Bridegroom Dance at his wedding ram charan Peddi chikiri Song

ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మానియా నడుస్తోంది. ఈనెల 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.345 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే పాజిటివ్ తెచ్చుకున్న ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ మూవీలోని సాంగ్స్‌ అభిమానులను ఓ ఊపు ఊపేశాయి. రైరై రారా అంటూ సాగే పాటతో పాటు చికిరి చికిరి సాంగ్‌కు ఫ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొట్టేశారు. పిల్లల నుంచి ముసలివాళ్లు సైతం కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇటీవల జరిగిన పెద్ది ఈవెంట్‌లో ప్రదర్శించారు. పెద్ది సాంగ్స్ అంతలా ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్‌ దక్కించుకున్నాయి.

తాజాగా చికిరి చికిరి సాంగ్‌కు ఓ వరుడు స్టెప్పులేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన కాబోయే సతీమణి ముందే స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement