అనంత్ శ్రీరామ్ కామెంట్స్.. ఆ స్టార్‌ హీరోను ఉద్దేశించే అన్నారా? | Lyricist Ananth Sriram Comments in Peddi Success event goes Viral | Sakshi
Sakshi News home page

Ananth Sriram: అనంత్ శ్రీరామ్ కామెంట్స్.. ఆ స్టార్‌ హీరోనే టార్గెట్ చేశారా?

Jun 24 2026 3:35 PM | Updated on Jun 24 2026 4:36 PM

Lyricist Ananth Sriram Comments in Peddi Success event goes Viral

రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది సూపర్ హిట్‌గా నిలిచింది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ హిట్ కావడంతో మేకర్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ మూవీ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెద్ది మూవీ రూ.420 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది కదా వసూళ్ల వరద అంటే.. ఈ వరద మీద బురద చల్లాలనుకున్ దురద గాళ్ల సరదా తీర్చేసిన అభిమానులు మీరు అంటూ ప్రశంసించారు. అందుకు మీకు చప్పట్లు కొట్టడానికి మా బృందం మీ దగ్గరకు వచ్చిందన్నారు. ఏదో భారీ వాహనాలను గాల్లోకి లేపితే వచ్చే చప్పట్లు కొట్టడం కాదు.. కథ మొత్తం చూసి, కళ్లలో నీళ్లు పెట్టుకుని, కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టిన అభిమానులు మీరు అంటూ ఫ్యాన్స్‌ను కొనియాడారు.

ఆ హీరో గురించేనా?

అయితే వాహనాలను గాల్లోకి లేపడం లాంటి సీన్స్ ఎక్కువగా బాలయ్య సినిమాల్లోనే ఉంటాయి. అనంత్ శ్రీరామ్ చేసిన ఈ కామెంట్స్  పరోక్షంగా బాలకృష్ణను ఉద్దేశించే చేశారా? అని నెట్టింట చర్చ మొదలైంది. ‍అయితే ఈ కామెంట్స్‌పై మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకరిని పొగడాలంటే ఇంకొకరిని తక్కువ చేసేి మాటాడాలా? అంటూ అనంత్ శ్రీరామ్‌కు కౌంటరిస్తున్నారు. మరి అనంత్ శ్రీరామ్ తనపై వచ్చే ట్రోల్స్‌కు ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే. 

ఇది చదవండి: ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement