'నాకు కెపాసిటీ ఉంది.. అలాంటి కథలు వస్తే చేస్తా' | Megastar chiranjeevi about her movies selection and stories | Sakshi
Sakshi News home page

Megastar chiranjeevi: 'నాకు అలాంటి కథలు రావట్లేదు': చిరంజీవి

Jun 14 2026 6:47 AM | Updated on Jun 14 2026 10:40 AM

Megastar chiranjeevi about her movies selection and stories

మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు, కథల ఎంపికపై తన అభిప్రాయం పంచుకున్నారు. పెద్ది టీమ్‌తో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం తనతో చాలాసార్లు నా సినిమాల కథల గురించి మాట్లాడారని అన్నారు. రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి చాలా నటన, పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చేశావని మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కమర్షియల్ వైపు వెళ్లిపోతున్నావని అన్నారని మెగాస్టార్ తెలిపారు.

నీలో ఒక కమల్‌ హాసన్, రజినీకాంత్, బాలచందర్ లాంటి ఉన్నారని నాతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. దంగల్, చక్ దే లాంటి సినిమాలు చూసి.. నాకు కూడా అలాంటి సినిమాలు చేయాలని అనిపించిందని చెప్పానని వెల్లడించారు. నేను అలాంటి కంటెంట్ సినిమాలు వస్తే ఎందుకు చేయను? అని అన్నానని చెప్పారు. దంగల్ తరహాలోనే పెద్ది సినిమా కూడా ఉందని మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఆ చిత్రంలో ఆడపిల్లలతో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉందన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement