పెద్ది ప్రీమియర్ షో.. ఉపాసన ఏ థియేటర్‌లో చూడనుందంటే? | Ram charan wife Upasana Konidela attends Peddi Movie premier Show | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది ప్రీమియర్ షో.. ఉపాసన వీక్షించే థియేటర్‌ ఇదే..!

Jun 3 2026 7:42 PM | Updated on Jun 3 2026 7:57 PM

Ram charan wife Upasana Konidela attends Peddi Movie premier Show

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా పెద్ది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెద్ది పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సినిమా చూసేందుకు మెగా ఫ్యాన్స్ అంతా సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీస్థాయిలో పెరిగిపోయాయి.

ఈ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల రానుంది. బాలానగర్‌లో విమల్ 70ఎంఎం థియేటర్‌లో ఆమె పెద్దిని వీక్షించనుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు ఉపాసనతో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కూడా హాజరు కానున్నారు. పెద్ది కోసం  గ్రాండ్‌గా సెలబ్రిటీ ప్రీమియర్ షోను ప్లాన్ చేశారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం పెద్దిని వీక్షించనున్నారు.

కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement