మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్ రిలీజ్ కాగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సూపర్ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ కానుందని ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.
టికెట్ బుకింగ్స్ ఓపెన్..
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే కేవలం ఏపీలో మాత్రమే ధరల పెంపునకు అనుమతి లభించింది. ప్రీమియర్ షోలతో ఫస్ట్ డే టికెట్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అంతేకాదు, జూన్ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్‌ను కూడా కొన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. జూన్ 3న స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 ఉండగా.. జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు కూడా అనుమతిచ్చారు. అంతేకాకుండా రోజుకు 5 షోలు వేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.


