'మీ రాకా కోసం ఎదురు చూస్తున్నా..' బన్నీకి రామ్ చరణ్ రిప్లై | Ram Charan Reply To Allu arjun Review On Peddi Movie | Sakshi
Sakshi News home page

Peddi Movie: 'మీ రాకా కోసం ఎదురు చూస్తున్నా..' బన్నీకి పెద్ది రిప్లై

Jun 10 2026 9:23 PM | Updated on Jun 10 2026 9:23 PM

Ram Charan Reply To Allu arjun Review On Peddi Movie

అల్లు అర్జున్‌ పెద్ది రివ్యూకు రామ్ చరణ్ స్పందించారు. మీరు మాకు శుభాకాంక్షలు చెప్పడం మాకు టీమ్‌కు చాలా ప్రత్యేకమన్నారు. మీ సినిమా రాకా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. మీరు మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇటీవల పెద్ది వీక్షించిన అల్లు అర్జున్‌ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు.  నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రామ్‌ చరణ్‌ నటన మైండ్‌ బ్లోయింగ్‌. ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులతో అలరించాడని అన్నారు. నా బ్రదర్‌ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్‌ నిజమైన అర్హుడని ప్రశంసించారు. జాన్వీ కపూర్‌, జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. చరణ్‌ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు.

ఇక పెద్ది సినిమా విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement