రామ్ చరణ్ పెద్ది వసూళ్లు.. ఐదు రోజుల్లోనే క్రేజీ మార్క్ | Ram Charan Peddi Movie Collections In Just Five Days | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది పైసా వసూల్.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Jun 9 2026 3:51 PM | Updated on Jun 9 2026 3:54 PM

Ram Charan Peddi Movie Collections In Just Five Days

రామ్ చరణ్ పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.  బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రీమయర్స్‌తో మొదలైన పెద్ది ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఓవరాల్‌గా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, రెజ్లర్‌గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement