‘పెద్ది’ చిత్రానికి మరో బిగ్‌ షాక్‌.. అట్రాసిటీ కేసుకు డిమాండ్! | Tribal Communities File Complaint Against Peddi Team and Censor Officials In Vizianagaram | Sakshi
Sakshi News home page

‘పెద్ది’ చిత్రానికి మరో బిగ్‌ షాక్‌.. కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు!

Jun 8 2026 2:36 PM | Updated on Jun 8 2026 2:54 PM

Tribal Communities File Complaint Against Peddi Team and Censor Officials In Vizianagaram

రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ చిత్రానికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఇప్పటికే సినిమాలోని జాన్వీ కపూర్‌ పాత్రపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సాధారణ మహిళలే కాకుండా సినిమా హీరోయిన్లు సైతం తెరపై జాన్వీని చూపించిన తిరుని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పి..ఆ సీన్లలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించాడు. అయినా కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వేళ.. చిత్రబృందానికి ఆదివాసీ సంఘాలు షాకిచ్చాయి. 

(చదవండి: ‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్‌ షాకింగ్‌ కామెంట్స్‌)

సినిమాలో గిరిజనులను కించపరిచేలా సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయంటూ విజయనగరం జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఆదివాసీ సంఘాలు ఫిర్యాదు చేశాయి. సినిమా మొత్తంలో 15 సార్లు గిరిజనులను కించపరిచేలా పదాలు వాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రబృందంతో పాటు సెన్సార్‌ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కలెక్టర్‌, ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. 

గిరిజన హక్కుల చట్టంలో స్పష్టం చేసిన పదాలనే సినిమాలో అసభ్యంగా వాడడం..వాటినే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌ ఇష్టానుసారంగా  వినియోగించడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ నాలుగు రోజుల్లో రూ.292.5 కోట్లు వసూలు చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement