ఏపీలో టికెట్ ధరల పెంపు.. తెలంగాణలో పెద్ది పరిస్థితేంటి? | Peddi Movie TIcket Prices and Bookings Telangana | Sakshi
Sakshi News home page

Peddi Movie: ఏపీలో టికెట్ ధరల పెంపు.. తెలంగాణలో పెద్ది పరిస్థితేంటి?

Jun 2 2026 7:26 PM | Updated on Jun 2 2026 8:03 PM

Peddi Movie TIcket Prices and Bookings Telangana

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది ప్రీమియర్స్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచే  ప్రీయమర్ షోలు షురూ కానున్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత పెద్ది మూవీపై అంచనాలు ఓ రేంజ్‌కు దూసుకెళ్లాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేలా జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. దీంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఇక తెలంగాణ విషయానికొస్తే పెద్ది టికెట్ ధరల పెంచేందుకు అనుమతులు రానట్టేనని తెలుస్తోంది. టికెట్ రేట్లపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. రేపటిలోగా ఎలాంటి ప్రకటన రాకపోతే సాధారణ రేట్ల‌తోనే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయాలని పెద్ది టీమ్ భావిస్తోంది. దీంతో రేపటి నుంచే తెలంగాణలో పెద్ది మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభించే అవకాశముంది. మరోవైపు  పెద్ది ప్రీమియర్స్ సైతం తెలంగాణలో లేనట్టేనని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement