అతనికి 22.. ఆమెకు 32.. స్కెచ్ వేసి మరీ పెళ్లి! | Youth Trapped And Forced Into Marriage With Older Woman In Khagaria, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

అతనికి 22.. ఆమెకు 32.. స్కెచ్ వేసి మరీ పెళ్లి!

Jul 11 2026 8:13 AM | Updated on Jul 11 2026 10:01 AM

Youth trapped and forced into marriage with older woman in Khagaria

బీహార్‌లో సినిమా ఫక్కీలో జరిగిన ఈ విచిత్ర పెళ్లి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే...

బీహార్‌లోని ఖగారియా జిల్లా గంగా ప్రసాద్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ (22)కు, అదే ప్రాంతంలో నర్సుగా పనిచేస్తున్న 32 ఏళ్ల మహిళతో రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటూ సన్నిహితంగా ఉండేవారు.

కొన్ని రోజుల క్రితం, సదరు మహిళ రాత్రి సమయంలో నితీశ్ కుమార్‌ను తన ఇంటికి రమ్మని పిలిచింది. ప్రియురాలు పిలిచింది కదా అని నితీశ్ ఆమె ఇంటికి వెళ్లాడు. కానీ, అక్కడే అతనికి ఊహించని షాక్ తగిలింది. అప్పటికే పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉన్న మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు వీరిద్దరినీ ఒకే గదిలో 'రెడ్‌హ్యాండెడ్‌గా' పట్టుకున్నారు.

రాత్రికి రాత్రే ఈ విషయాన్ని ఊరంతా రచ్చ చేశారు. గ్రామ పెద్దలు, గ్రామస్తులను అక్కడికి పిలిపించి పంచాయితీ పెట్టారు. నితీశ్ కుమార్ ఎంత బ్రతిమాలినా వినకుండా, అందరి సమక్షంలో అక్కడికక్కడే ఆ మహిళతో నితీశ్‌కు బలవంతంగా పెళ్లి జరిపించారు. 

పెళ్లి జరిగిన మరుసటి రోజే నితీశ్ కుమార్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. సదరు మహిళ కుటుంబ సభ్యులు తప్పుడు ప్లాన్ వేసి తనను రాత్రి పూట ఇంటికి పిలిపించారని, ఆపై చంపేస్తామని ఆయుధాలతో బెదిరించి, బలవంతంగా ఈ పెళ్లి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పెళ్లి తనకు ఏమాత్రం ఇష్టం లేదని, న్యాయం చేయాలని కోరాడు.

ప్రస్తుతం ఈ విచిత్ర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అసలు ఆ రాత్రి ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement