బెంగాల్‌పై బీజేపీ ‘యూపీ’ వ్యూహం.. పోటీలో ఎవరంటే? | Monks will be contest in Bengal Election For BJP | Sakshi
Sakshi News home page

బెంగాల్‌పై బీజేపీ ‘యూపీ’ వ్యూహం.. పోటీలో ఎవరంటే?

Mar 25 2026 7:01 AM | Updated on Mar 25 2026 10:27 AM

Monks will be contest in Bengal Election For BJP

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఫలించిన ఎన్నికల వ్యూహాన్ని పశ్చిమబెంగాల్‌లో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సన్యాసులు, పూజారులు, ఆధ్యాత్మికవాదులను ఎన్నికల బరిలో దించుతోంది. యూపీలో గోరఖ్‌నాథ్‌ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్‌ పలుమార్లు ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.

సన్యాసి వర్గం నుంచి వచ్చిన సాక్షి మహరాజ్, స్వామి అవైధ్యనాధ్, స్వామి చిన్మయానంద్‌ తదితరులు ఎన్నికల్లో గెలిచారు. బెంగాల్‌లో ఆధ్యాతి్మక రంగానికి చెందిన పలువురికి బీజేపీ టికెట్లిచి్చంది. భారత్‌ సేవాశ్రమంలో పని చేసిన ఉత్పల్‌ మహారాజ్‌ను కాలియాగంజ్‌ నుంచి బరిలో దించింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి 94 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన సౌమన్‌ రాయ్‌తో ఉత్పల్‌ పోటీ పడే అవకాశముంది.

ఉల్బేరియా సౌత్‌ నుంచి స్వామి మంగళానంద పూరికి బీజేపీ టికెట్‌ దక్కింది. తృణమూల్‌కు చెందిన పులోక్‌ రాయ్‌తో ఆయన తలపడనున్నారు. మఠాలు, ఆశ్రమాలకు ఆదరణ బాగా ఉండే నవద్వీప్‌ నుంచి శ్రీ శృతి శేఖర్‌ గోస్వామిని బీజేపీ బరిలోకి దించింది. బెహలా పూర్బ నుంచి సునీల్‌ మహారాజ్‌ పోటీలో ఉన్నారు. హన్సన్‌ నుంచి చారిత్రక తారాపీఠ ఆలయ పూజారి నిఖిల్‌ బెనర్జీ పోలీకి టికెటిచి్చంది. వీటిలో చాలావరకు తృణమూల్‌ సిట్టింగ్‌ స్థానాలే ఉండటం విశేషం!  

 

Advertisement
 
Advertisement
Advertisement