బీజేపీ ప్రభంజనం.. ఎన్నికల్లో భారీ విజయం | Gujarat Municipal Corporation Results 2026: BJP Win Major Places | Sakshi
Sakshi News home page

బీజేపీ ప్రభంజనం.. ఎన్నికల్లో భారీ విజయం

Apr 28 2026 12:21 PM | Updated on Apr 28 2026 12:36 PM

Gujarat Municipal Corporation Results 2026: BJP Win Major Places

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. గుజరాత్‌లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా మరియు పంచాయతీలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల మేరకు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది.

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. పోలింగ్ జరిగిన 15 మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగింటిలో విజయం సాధించి మెజారిటీని నిలబెట్టుకుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లు అయిన మెహసానా, మోర్బి, నడియాడ్, వాపిలలో బీజేపీ విజయాలు సాధించగా, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 15 కార్పొరేషన్లలోని 1,044 సీట్లలో ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 718 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, 88 సీట్లతో ముందుకు సాగుతోంది. మిగతా పార్టీలు ప్రభావం చూపించలేకపోయాయి.

అలాగే, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. గుజరాత్‌లోని 84 మున్సిపాలిటీలలో మొత్తం 2624 స్థానాలు ఉండగా.. అధికార బీజేపీ 575 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. మరో 11 స్థానాల్లో ఇతర పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి.

 

  • అహ్మదాబాద్‌ మున్సిపాలిటీలో బీజేపీ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ సాధించిన 11 స్థానాల్లో ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఖాతాను తెరవలేకపోయింది.

  • సూరత్‌లో బీజేపీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

  • వడోదరలో బీజేపీ 76 స్థానాల ఆధిక్యాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ ఐదు స్థానాలో ఆధిక్యంలో ఉంది.

  • రాజ్‌కోట్‌లో బీజేపీ 20 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • మోర్బి మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ ఘన విజయం దిశగా ముందుకెళ్తోంది. ఇక్కడ బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఇంకా ఖాతాను తెరవలేకపోయింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 52 స్థానాలు ఉన్నాయి.

👉ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 26, 27 తేదీలలో 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలలో పోలింగ్ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 66% ఓటింగ్‌ నమోదు అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement