అన్నామలై కొత్త పార్టీ? | Sources Says BJP Leader Annamalai To Launch New Party In Tamil Nadu | Sakshi
Sakshi News home page

అన్నామలై కొత్త పార్టీ?

Jun 1 2026 7:24 AM | Updated on Jun 1 2026 7:22 PM

Sources Says BJP Leader Annamalai To Launch New Party In Tamil Nadu

సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా జూన్‌ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోయంబత్తూరు నగరంలో పెద్దఎత్తున పోస్టర్లను హోరెత్తించడం చర్చకు దారి తీసింది. 

అయితే, తమిళనాడులో బీజేపి బలోపేతానికి కృషి చేసి అన్నామలైను అన్నాడీఎంకే ఒత్తిడితో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కానీ, ఆయనకు ఇంత వరకు బీజేపీలో గానీ, కేంద్రంలోని ఎలాంటి పదవీ అన్నది ఇవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సైత దూరంగా నిలబడ్డ అన్నామలై తాజాగా కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ఆదివారం ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. 

ఈ సందర్భంగా ‘మా నాయకుడా. ముందుండి నడిపించు అన్న నినాదంతో కోయంబత్తూరు మాజీ మేయర్‌ ఉత్తమ్‌ బాలాజీ రామస్వామికి చెందిన ఉత్తమ్‌ ఫౌండేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో నగరమంతటా అన్నామలైకు మద్దతుగా భారీ పోస్టర్లను అతికించారు. సింగనల్లూరు, అవినాశి రోడ్డుతో పాటు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వాటిపై అన్నామలై చిత్రాలతో పాటు.. ‘మా నాయకా, ముందుకొచ్చి నాయకత్వం వహించండి..రా.. నాయకత్వం వహించు‘ అనే నినాదాలను ముద్రించడం చర్చకు దారి తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement