వీగిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు | Three Bills Parliament Special Session 2026 Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

వీగిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు

లోక్‌సభ వాయిదా

  • లోక్‌సభ రేపటికి వాయిదా
  • వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా 
  • మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో వాయిదా
     
2026-04-17 19:54:51

వీగిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు

  • వీగిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు
  • మూడింట రెండో వంతు మెజారిటీ సాధించలేకపోయిన బిల్లు
  • మొత్తం పోలైన ఓట్లు 528
  • బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు.. బిల్లుకు వ్యతిరేకంగా 230
  • బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 356
  • మహిళా బిల్లు వీగిపోవడంతో మిగిలిన రెండు బిల్లులను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు ప్రకటన
2026-04-17 19:37:24

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు

  • 131వ రాజ్యాంగ సవరణ,డీలిమిటేషన్‌,యూటీ చట్టాల సవరణ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌  
  • వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
  • అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు
  • బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 356
2026-04-17 19:32:35

మోదీ ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షం వాటిని వ్యతిరేకిస్తూనే ఉంది : అమిత్‌షా

  • ఓబీసీలను వ్యతిరేకించే పార్టీల్లో కాంగ్రెస్‌ ముందుంటుంది

  • చరణ్‌ సింగ్‌,కేసరిలాంటి ఓబీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది

  • ఓబీసీల కోసం కాకాసింగ్‌ కాలేకర్‌ చేసిన సూచనలను కాంగ్రెస్‌ తుంగలో తొక్కింది

  • మండల్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను సైతం కాంగ్రెస్‌ ఆమోదించలేదు

  • వీపీ సింగ్‌ వచ్చిన తర్వాత మండల్‌ కమిషన్‌ రిపోర్టుకు మోక్షం దక్కింది

  • రాజీవ్‌ గాంధీ తన జీవితాంతం మండల్‌ కమిషన్‌ నివేదికను  వ్యతిరేకిస్తూ వచ్చారు.

  • 15-20 సార్లు ఎన్నికల్లో ఓడిపోయాక కాంగ్రెస్‌కు ఓబీసీలు గుర్తుకొచ్చారు

  • బీజేపీ మాత్రమే అత్యంత వెనకబడిన ఓబీసీ నాయకుడు మోదీని ప్రధానినిన చేసింది

  • మోదీ ప్రభుత్వంలో 27మంది కేంద్రమంత్రులు ఓబీసీలే

  • మొత్తం క్యాబినెట్‌లో ఓబీసీల శాతం 40

  • 1992,72,73 సవరణల ద్వారా వీపీ నరసింహరావు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు

  • పీవీ నరసింహరావును ఎప్పుడూ కాంగ్రెస్‌ తన సొంత మనిషిగా భావించలేదు

  • 1996లో దేవేగౌడ 81వ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు

  • మహిళా బిల్లును బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు

  • మన్మోహన్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చిన పార్టీలే మహిళా బిల్లును వ్యతిరేకించాయి.

  • కాంగ్రెస్‌ కుట్రతోనే తన అనుకూల పార్టీలతో మహిళా బిల్లును వ్యతిరేకించింది

  • ప్రధాని మోదీ నాయకత్వంలో నారీ శక్తి బిల్లు పాస్‌ అయ్యింది

  • ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లును.. అడ్డుకుంటున్న వారికి ప్రజాక్షేత్రంలో మహిళలు బుద్ధి చెబుతారు

  • మేం ఒకే మహిళను సీఎం చేశామని అఖిలేష్‌ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధం

  • సుష్మాస్వరాజ్‌ తొలిఢిల్లీ సీఎం, ఉమా భారతి మధ్యప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి

  • వసుంధరాజే రాజస్థాన్‌ తొలి ముఖ్యమంత్రి

  • గుజరాత్‌ తొలి ముఖ్యమంత్రిగా ఆనందీబెన్‌ పటేల్‌ను ఎన్నుకున్నాం

  • మేము ద్రౌపది ముర్మును తొలి ఆదివాసి రాష్ట్రపతిగా ఎన్నుకున్నాం

  • మేం తీసుకువచ్చే సంస్కరణలను కాంగ్రెస్‌ అడ్డుకుంటోంది

  • ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మేం మహిళా రిజర్వేషన్లు ఇస్తాం

  • ఆర్టికల్‌ 370 రద్దు, జీఎస్టీని కాంగ్రెస్‌ అడ్డుకుంది

  • ట్రిపుల్‌ తలాక్‌ను అడ్డుకున్నా, రామమందిరం నిర్మించినా కాంగ్రెస్‌ అడ్డుకుంది

  • మోదీ ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షం వాటిని వ్యతిరేకిస్తూనే ఉంటుంది

  • కనీసం మహిళల రిజర్వేషన్లనైనా వ్యతిరేకించరని నేను అనుకున్నా

  • కానీ ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్లను సైతం అడ్డుకుంటున్నాయి

  • మహిళా రిజర్వేషన్‌ బిల్లులోని 81/1 నిబంధన ప్రకారం.. లోక్‌సభ సీట్లు 850కి పెరుగుతాయి.

  • లోక్‌సభ,అసెంబ్లీలోనూ 50శాతం సీట్లు పెంచి మహిళలకు రిజర్వేషన్లు

  • శషబిషలతో కాంగ్రెస్‌ పార్టీ ఈ బిల్లును అడ్డుకుంటోంది

  • ఈ బిల్లు పాస్‌ అయితే మోదీకి పేరు వస్తుందనే కాంగ్రెస్‌ బిల్లును అడ్డుకుంటోంది

2026-04-17 19:26:29

మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తి లేదు.. మేం విరుద్ధం : అమిత్‌ షా

రిజర్వేషన్లు సామాజికంగా వెనకబడిన వారికి వర్తిస్తాయి.
షెడ్యూల్‌ కులాలు,షెడ్యూల్‌ తెగలకు మాత్రమే వర్తిస్తాయి
మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే పద్దతి ఎక్కడా లేదు
ఇండి కూటమి తమ రాజకీయాల కోసం మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకువచ్చే కుట్ర
మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తి లేదు. మేం విరుద్ధం
 

2026-04-17 19:05:02

ప్రతి పక్షాలకు అమిత్‌షా ఛాలెంజ్‌

  • పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు అమిత్‌షా ఛాలెంజ్‌
  • 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే.. మీరు బిల్లుకు మద్దుతు ఇస్తారా
  • గంటలో బిల్లును మార్చి తీసుకుని వస్తా
  • బిల్లు కాపీని ప్రతీ ఎంపీకి అందజేస్తాం.. 50శాతం సీట్ల పెంపును  బిల్లులో పెట్టేందుకు సిద్ధం
  • డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కలపకూడదు
  • పెరిగే సీట్లను పొందుపరిచి బిల్లును తీసుకుని వస్తాం
  • బిల్లు కాపీని ప్రతీ ఎంపీకి అందజేస్తాం.. 50శాతం సీట్ల పెంపును  బిల్లులో పెట్టేందుకు సిద్ధం
  • డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కలపకూడు.
  • ఇది మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ వేసిన ట్రాప్‌ 
  • కాంగ్రెస్‌ పార్టీ మద్దతివ్వకుంటే మహిళా బిల్లు వీగిపోతుంది
  • కానీ దేశంలోని మహిళలందరూ తమ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని చూస్తున్నారు
  • లోక్‌సభలో గొడవ చేసి మీరు బతికిపోవచ్చు
  • కానీ ప్రజాక్షేత్రంలో మీరు మహిళల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరు
     
2026-04-17 18:47:54

మహిళా బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదు : అమిత్‌షా

  • లోక్‌సభలో అమిత్‌ షా ప్రసంగం
  • విస్త్రృతంగా మాట్లాడేందుకు అన్నీ పార్టీలకు స్పీకర్‌ అవకాశం కల్పించారు
  • మహిళా బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదు
  • మాట్లాడిన వారందరూ మహిళా బిల్లుకు మద్దతు పలికారు
  • మహిళా బిల్లును ఇండియా కూటమి సభ్యులు వ్యతిరేకించారు
  • విపక్షాలు వ్యతిరేకించింది మహిళా రిజర్వేషన్‌ బిల్లును. డీలిమిటేషన్‌ బిల్లు కాదు
  • ఎస్సీ,ఎస్టీల సంఖ్య పెరిగినప్పుడు పార్లమెంట్‌లో వాళ్ల సంఖ్య పెరగాలి కదా
  • మహిళా బిల్లును మద్దతిస్తామంటూనే.. కానీ వ్యతిరేకిస్తామంటున్నారు
  • 130మంది ఎంపీ 56మంది మహిళా ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు
  • విపక్షాలది మహిళా వ్యతిరేక మైండ్‌ సెట్‌
  • 1970లో లోక్ సభ సీట్లు పెరిగాయి. ఆ తర్వాత పెంచలేదు
  • జనాభా లెక్కలకు డీలిమిటేషన్‌కు లింకు పెట్టింది మేం కాదు.. కాంగ్రెస్‌ 
  • 2029 ఎన్నికల్లో 33శాతం మహిళ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని మోదీ అనుకున్నారు. 
  • ప్రతిపక్షం మా మీద నమ్మకం ఉంచితే లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాం
  • డీలిమిటేషన్‌ను ప్రవేశ పెడతాం
  • డీలిమిటేషన్‌ నిబంధన ప్రకారం ప్రతి నియోజకవర్గంలో పబ్లిక్‌  హియరింగ్‌ పెట్టాలి
  • పార్లమెంట్‌ సభ్యులు పెరిగితే పనిరోజులు కూడా పెరుగుతాయి
  • రాహుల్‌ మాట్లాడేతీరు మార్చుకుంటే చాలా మందికి మాట్లాడే అవకాశం​ దక్కుతుంది
  • తమిళనాడు ఉదాహరణగా తీసుకుంటే 39లోక్‌సభ సీట్లలో 13సీట్లు మహళలకు రిజర్వ్‌ అవుతాయి
  • ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే సాధారణ సీట్లు తగ్గుతాయి
  • కోవిడ్‌ కారణంగా జనాభా లెక్కల ప్రక్రియ ఆలస్యం అయింది
  • 2024లో జనాభా లెక్కలు ప్రారంభం అయినప్పుడు చాలా పార్టీలు కులగణన చేయాలని డిమాండ్‌ చేశాయి
  • అందరితో చర్చించి 2025లో కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించింది
  • కులగణనపై ప్రతిపక్షాలకు ప్రేమలేదు
  • కేవలం రాజకీయం చేయడమే ప్రతిపక్షాల ఉద్దేశం
  • ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. 
  • కులగణను అడ్డుకోవడానికి రాజ్యాంగ సవరణ చేస్తున్నామని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ప్రచారం చేస్తున్నాయి.
  • నేనుస్పష్టం చేస్తున్నాను.. పార్లమెంట్‌లో దక్షిణాదికి సమాన హక్కు ఉంటుంది
  • ఉత్తరం,దక్షిణం అంటూ దేశాన్ని ముక్కలు చేయోద్దని కోరుతున్నా
  • పార్లమెంట్‌ ప్రతిజ్ఞ చేసే సమయంలో దేశం గురించి ఆలోచిస్తాం
  • ప్రాంతాల వారీగా దేశాన్ని విభజించే శక్తులను అడ్డుకోవాలి
2026-04-17 18:13:41

మెజార్టీపై కొనసాగుతున్న ఉత్కంఠ

  • మరి కొద్దిసేపట్లో లోక్‌సభలో కీలక బిల్లులు
  • కీలక బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం
  •  సొంతంగా స్పష్టమైన మెజార్టీ లేని ఎన్డీఏ
  • దీంతో బిల్లు మద్దుతుపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • ఈ నేపథ్యంలో మోదీతో కిరణ్ రిజిజు ప్రత్యేక భేటీ
  • బిల్లులకు కావాల్సిన మద్దతుపై చర్చిస్తున్నట్లు సమాచారం
  • బిల్లుల ఆమోదానికి ‍ప్రత్యేక మోజారిటీ 
  •  మూడింట రెండొంతల మోజారిటీ అవసరం
  • ఎన్డీఏ సంఖ్యాబలం 292 
  • బిల్లుల మద్దతుకు 360 మంది సభ్యుల మద్దతు అవసరం
  • మరో 68 మంది ఎంపీల మద్దతు కోసం బీజేపిీ ప్రయత్నం
  • రాత్రి ఏడు గంటలకు బిల్లులపై ఓటింగ్ జరిగే అవకాశం
2026-04-17 17:32:46

ఏపీలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది: ఎంపీ మిథున్‌రెడ్డి

  • ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ దొరికారు
  • ఏపీలో మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలి
  • విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు
  • డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు మేం  మద్దతిస్తాం
  • దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలి
  • డీలిమిటేషన్‌ ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన భాగస్వామ్యం ఇవ్వాలి
  • రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీట్ల సంఖ్య పెంచాలి
  • ప్రతి రాష్ట్రంలో కచ్చితంగా 50 శాతం సీట్లు పెంచే విషయం చట్టంలో పెట్టాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం
  • ఇది కేవలం నోటి మాటగా చెప్తే మేం అంగీకరించం
  • రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌లో చెప్పిన మాటలు అమలు కాలేదు.
     
2026-04-17 17:30:38

కాసేపట్లో లోక్‌సభలో కీలక బిల్లులపై ఓటింగ్‌

  • లోక్‌సభలో కీలక బిల్లులపై ఓటింగ్‌
  • సా. 6 గంటలకు లోక్‌సభలో అమిత్‌ షా ప్రసంగం
  • అమిత్‌ షా ప్రసంగం తర్వాతే ఓటింగ్‌
  • రాత్రి 7 గంటల నుంచి బిల్లులపై ఓటింగ్‌ జరిగే అవకాశం
2026-04-17 16:51:39

నేను మాట్లాడింది కేవలం బీజేపీ గురించి మాత్రమే: రాహుల్‌

నేను సైన్యం గురించి కాదు.. బీజేపీ గురించే మాట్లాడాను: రాహుల్‌

నేను సైన్యాన్ని, దేశాన్ని ఎక్కడా అవమానపర్చలేదు

2026-04-17 15:25:43

దేశ ప్రజలను రాహుల్‌ అవమానించారు: కిరణ్‌ రిజిజు

  • లోక్‌సభలో  ప్రతిపక్ష నేత ఇలాంటి భాషమాట్లాడటం సిగ్గుచేటు: కిరణ్‌ రిజిజు
  • దేశ ప్రజలను, సైన్యాన్ని సైతం రాహుల్‌ అవమానిస్తున్నారు
     
2026-04-17 15:23:52

రాహుల్‌ వ్యాఖ్యలపై లోక్‌సభలో రగడ

  • మోదీ మెజీషియన్‌ అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై  ఎన్డీఏ అభ్యంతరం
  • రాహుల్‌వ్యాఖ్యలు సరిగా లేవు: రాజ్‌నాథ్‌ సింగ్‌
  • రాహుల్‌ గాంధీ వెంటనే క్షమాపణ చె ప్పాలి: రాజ్‌నాథ్‌ సింగ్‌
  • ప్రధాని మోదీని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమే
  • రాహుల్‌ను సభ నుంచి బహిష్కరించాలి
  • ఆపరేషన్‌ సింధూర్‌, బాలకోట్‌ వంటి అంశాలను ప్రధాని మ్యాజిక్‌ అంటూ రాహుల్‌ అవమానించారు.
     
2026-04-17 15:21:30

రాహుల్‌ ప్రసంగంపై స్పీకర్‌ ఓంబిర్లా అభ్యంతరం

  • రాహుల్‌ ప్రసంగంపై అభ్యంతరం చెప్పిన  స్పీకర్‌ ఓంబిర్లా
  • మోదీ మెజీషియన్‌ అంటూ రాహుల్‌ వ్యాఖ్యలు
  • సభా సంప్రదాయాలు పాటించాలన్న స్పీకర్‌
     
2026-04-17 15:17:30

ఇది మహిళా బిల్లు కానే కాదు.. రాహుల్ గాంధీ

  • పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ తీవ్రవ్యాఖ్యలు

  • మహిళా బిల్లు పేరుతో ప్రధాని మోదీ  మ్యాజిక్‌  చేస్తున్నారు.

  • మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకం రాహుల్‌ గాంధీ 

  • నిన్న సభలో ప్రియాంక ప్రసంగం ఎంతో గర్వంగా ఉంది 

  • మా నానమ్మ ఇందిర వల్లే నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది.

  • నిజాలు చేదుగా ఉంటాయి కానీ చెప్పాలి: రాహుల్

  • ఇప్పుడు పెడుతుంది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు 

  • బిల్లులన్నీ కలిపి తీసుకరావడం సిగ్గుచేటు

  • ఇది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు.

  • మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్.  

  • 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది.

  • రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలనుకుంటున్న బిల్లు.

  • రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలు పెంచాలనుకుంటున్నారు.

  • కులగణన లెక్కలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నదే అసలు ఎజెండా.  

  • ఓబీసీలకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇది.

  • రాజ్యాంగం కంటే మనువాదానికి  ప్రాధాన్యత ఇస్తున్నారు. 

  • ఈ బిల్లును విపక్షాలు కలిసికట్టుగా ఓడిస్తాయి.

  • ఉన్నతస్థాయి  అధికారుల్లో , న్యాయవ్యవస్థలో ఓబీసీలు గిరిజనులు లేరు.  

  • ప్రైవేటు రంగంలో కూడా ఓబీసీ, ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యత లేదు. 

  • హిందుత్వం పేరుతో బీసీ, ఎస్సీ ,ఎస్టీలకు  చేసిందేమీ లేదు.

  • ఈ బిల్లు పాస్‌ కాదని బీజేపీకి కూడా తెలుసు

  • ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతాయని కూడా తెలుసు

  • అయినా బీజేపీ మహిళా పక్షపాతి అని చెప్పాలనుకుంది
     
2026-04-17 14:52:35

వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యత: తనూజా రాణి

  • వైఎస్సార్‌సీపీ ఎంపీ తనూజా రాణి కామెంట్స్‌..
  • మహిళా రిజర్వేషన్ల బిల్లు చరిత్రాత్మకం.
  • ఈ నిర్ణయం వల్ల దేశం మరింత ముందుకెళ్తుంది.
  • వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యత.
  • ఏపీలో మహిళను తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్‌ది
  • నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టులలో  మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చారు.
  • వైఎస్‌ జగన్‌ ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదే అందించారు.
  • అమ్మ ఒడి , మహిళల పేరుపైనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు
  • 2019-24 వైఎస్ జగన్ పరిపాలనా కాలం మహిళలకు స్వర్ణ యుగం లాంటిది
  • మహిళలకు సామాజిక, ఆర్థిక భద్రతను వైఎస్‌ జగన్‌ కల్పించారు.
  • వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళలు ఆత్మ విశ్వాసంతో జీవించేలా చేశారు.
  • ఏపీలో కూటమి పాలనలో మహిళలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి.
  • అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు వేధిస్తున్నారని మహిళలు చెబుతున్నారు.
  • టీడీపీ హయాంలో మహిళలపై కొనసాగుతున్న హింసను ప్రస్తావించిన తనూజ రాణి
  • మైక్ కట్ చేసిన సభా స్థానంలో ఉన్న టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
  • మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతున్న ఎంపీ మైక్‌ కట్ చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు 

    జగనన్న పాలన మహిళలకు స్వర్ణయుగం మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
     

2026-04-17 13:43:23

విపక్ష కూటమి కీలక భేటీ..

  • మహిళా బిల్లుపై ఓటింగ్‌కు ముందు విపక్ష కూటమి కీలక భేటీ.
  • ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి ఎంపీల సమావేశం.
  • 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • విపక్ష కూటమి ఎంపీలు కచ్చితంగా సభకు హాజరయ్యేలా చర్యలు.
  • కేసీ వేణుగోపాల్‌, చిదంబరం, మణిక్కం ఠాకూర్‌, కకోలి ఘోష్‌కు బాధ్యతలు. 
2026-04-17 13:35:06

కాసేపట్లో రాహుల్‌ గాంధీ ప్రసంగం

  • కాసేపట్లో రాహుల్‌ గాంధీ ప్రసంగం
  • లోక్‌సభలో ప్రసంగించనున్న రాహుల్‌ 
  • రాహుల్‌ ప్రసంగం అనంతరం మూడు గంటలకు అమిత్‌ షా ప్రసంగం
  • రాహుల్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చే అవకాశం
2026-04-17 13:27:45

ఎస్పీ డింపుల్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు..

  • ఎస్పీ డింపుల్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు..
  • డీలిమిటేషన్‌ను బీజేపీ ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది.
  • మహిళల పక్షాన విపక్షాలు లేవని తప్పుడు ప్రచారం.
  • బీజేపీ యూపీలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.
  • పార్లమెంట్‌లో ఇస్తున్న మోదీ గ్యారంటీలు ఎలా నమ్మాలి?.
  • జనాన్ని మభ్యపెట్టడానికే డీలిమిటేషన్‌, మహిళ బిల్లుతో ముడిపెట్టారు.
2026-04-17 13:09:59

టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ సీరియస్‌ కామెంట్స్‌..

  • టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ సీరియస్‌ కామెంట్స్‌..
  • బెంగాల్‌, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌ సమావేశాలు ఎలా పెడతారు?: కళ్యాణ్‌ బెనర్జీ
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లును స్వాగతిస్తున్నాం.
  • కానీ, డీలిమిటేషన్‌తో లింక్‌ చేయడం కరెక్ట్‌ కాదు. 
2026-04-17 12:33:27

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు

  • మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు
  • లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి కామెంట్స్‌
  • ప్రాంతీయ అసమానతలు లేకుండా చూడాలి.
  • డీలిమిటేషన్‌ బిల్లును స్వాగతిస్తున్నాం.
  • డీలిమిటేషన్‌ ప్రక్రియ సజావుగా సాగాలి.
  • డీలిమిటేషన్‌ అనేది విపక్షాలను అణగదొక్కే సాధనంగా ఉండకూడదు. 
  • ఏపీలో మేము అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం.
  • ఏపీలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
  • ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ దొరికారు.
  • మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలి.
  • విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.
  • కానీ చట్టంలో లేదని ప్రత్యేక హోదా హామీని మర్చిపోయారు. 
     
2026-04-17 12:08:41

రాజకీయాల కోసమే బిల్లులు: శశిథరూర్‌

  • రాజకీయాల కోసమే బిల్లులు: శశిథరూర్‌
  • శశిథరూర్‌ కామెంట్స్‌..
  • రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ బిల్లులు.
  • డీలిమిటేషన్‌ నిరంతర ప్రక్రియ.
  • మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్‌కు లింక్‌ పెట్టారు.
  • రాజ్యసభలో ఎన్ని సీట్లు పెరుగుతాయో చెప్పడం లేదు.
  • ఆలస్యం చేయకుండా మహిళ రిజర్వేషన్లు అమలు చేయాలి. 
2026-04-17 11:56:58

మధ్యాహ్నం రాహుల్‌ ప్రసంగం..

  • డీలిమిటేషన్‌ బిల్లుపై ఓటింగ్‌కు ముందు విపక్షాల కీలక భేటీ.
  • పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • ఈరోజు లోక్‌సభలో ప్రసంగించనున్న రాహుల్‌ గాంధీ
  • మధ్యాహ్నం మూడు గంటలకు రాహుల్‌ ప్రసంగం. 
2026-04-17 11:45:02

కాంగ్రెస్‌ ఎంపీల నిరసన..

  • పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసన.
  • రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌.
  • బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆగ్రహం.  
     
2026-04-17 11:38:12

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌కు మోదీ అభినందనలు

  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక
  • డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌.
  • మూడోసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్‌.
  • హరివంశ్‌ నారాయణ్‌కు ప్రధాని మోదీ అభినందనలు.
  • మోదీ కామెంట్స్‌..
  • హరివంశ్‌ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుంది.
  • చట్ట సభల్లో ఆయనకు చాలా అనుభవం ఉంది.
  • అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా. 
  • సమ తుల్యతతో సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను. 
2026-04-17 11:27:11

డీలిమిటేషన్‌ బిల్లుకు మేము వ్యతిరేకం: కనిమొళి

  • రెండో రోజూ సభకు నల్ల దుస్తులు ధరించి వచ్చిన డీఎంకే సభ్యులు.
  • డీలిమిటేషన్‌ బిల్లుకు మేము వ్యతిరేకం: కనిమొళి
  • బిల్లుపై చర్చ సమయంలో నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారు?: కనిమొళి
  • డీలిమిటేషన్‌పై కనీసం అఖిలపక్షం నిర్వహించలేదు.
  • రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పుడు మాట్లాడారు.
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రత్యేక సమావేశాలు పెట్టారు.
  • ఎన్నికల తర్వాత ఎందుకు సమావేశాలు నిర్వహించలేదు.
  • మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్‌కు లింకు పెట్టారు.
  • ఇండియా ఫెడరల్‌ సిస్టంను దెబ్బతీసేలా బిల్లుల రూపకల్పన ఉంది: డీఎంకే
  • జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా పాటించాయి. 
     
2026-04-17 11:20:49

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

  • రెండో రోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం
  • నేడు బిల్లులపై ఓటింగ్‌.. 
2026-04-17 11:05:05

కేసీ వేణుగోపాల్‌ కామెంట్స్‌..

  • కేసీ వేణుగోపాల్‌ కామెంట్స్‌..
  • సెప్టెంబర్‌ 13, 2023లో మహిళ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.
  • 543 సీట్లలో 1/3 రిజర్వేషన్‌ అమలు చేయాలి.
  • డీలిమిటేషన్‌ను మహిళా కోటా ముసుగు వేసుకొని చేస్తున్నారు: కాంగ్రెస్‌
  • సెప్టెంబర్‌ 21న రాజ్యసభ ఆమోదం.
  • రాత్రికి రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు ఇచ్చారు?.
  • 2023లో 454 మంది అనుకూలంగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓటు. 
2026-04-17 10:46:50

మోదీ, అమిత్‌ షా హామీలను నమ్మలేం: స్టాలిన్‌

  • మోదీ, అమిత్‌ షా హామీలను నమ్మలేం: స్టాలిన్‌
  • చట్ట సవరణ పేరుతో కొత్త కుట్రలు.
  • రాష్ట్రాల హక్కులను కాలరాయడమే ఇది.
  • పునర్విభజన బిల్లు తమిళనాడు ఉనికినే దెబ్బతీసేలా ఉంది.
  • నోటీ మాటలతో హామీలు ఇవ్వడం కాదు..
  • చట్ట సభల్లో రక్షణ కల్పించాలి.
  • కొత్తగా ఏర్పాటు చేసే కమిషన్‌కు కేంద్రం అపరిమిత అధికారులు కట్టబెట్టింది.
  • దీంతో, తమకు కావాల్సిన రాష్ట్రాల్లో సీట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించుకున్నారు.
2026-04-17 10:46:50

డీలిమిటేషన్ బిల్లుపై టెన్షన్

  • డీలిమిటేషన్ బిల్లుపై టెన్షన్
  • రాజ్యాంగ సవరణ బిల్లు గట్టెక్కుతుందా?
  • ప్రస్తుతం లోక్‌సభలో సీట్ల సంఖ్య: 540
  • 2/3 మెజారిటీకి కావలసిన సీట్లు : 360
  • ప్రస్తుతం ఎన్డీయే మెజారిటీ : 294
  • ఇంకా అవసరమైన సీట్ల సంఖ్య: 66
  • ఎన్డీయే & నాన్ యూపీఏ పార్టీల ఎంపీలపై బీజేపీ ఆశలు
  • ఎంపీలు గైర్హాజరైతే సభలో సంఖ్య బలం తగ్గి బిల్లు పాస్ అయ్యే అవకాశాల పైన కసరత్తు
2026-04-17 10:38:41

డీలిమిటేషన్‌పై తేజస్వీ యాదవ్‌ కామెంట్స్‌..

  • ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు..
  • బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తమ అజెండాను అమలు చేయాలని చూస్తున్నారు.
  • మహిళా రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్ బిల్లును చాలా చాకచక్యంగా తీసుకువచ్చారు.
  • రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని కేంద్రం చూస్తోంది.
  • బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ అజెండాను అమలు చేయాలని చూస్తున్నాయి. 
     
2026-04-17 09:37:35

ఓటింగ్‌పై ఉత్కంఠ..

  • ఓటింగ్‌పై ఉత్కంఠ..
  • నేడు లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్
  • విపక్షాల వ్యతిరేకత నేపథ్యంలో బిల్లులు ఆమోదం పొందుతాయా? లేదా అని సర్వత్రా ఉత్కంఠ
  • 131 రాజ్యాంగ సవరణ నియోజకవర్గాల పెంపు బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ తప్పనిసరి  
  • లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి 2/3 మెజారిటీ కరువు
  • ఈ అనుమానాల నేపథ్యంలో 2023 నారీ శక్తి వందన్ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్
  • ఒకవేళ నేడు బిల్లులు పాస్ కాకపోతే 2026-27 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్?
  • ఇప్పుడున్న 543 సీట్లలోని మహిళలకు సీట్లు రిజర్వ్ చేసే అవకాశం?
2026-04-17 07:57:06

క్రెడిట్‌ విపక్షాలకే.. మోదీ కామెంట్స్‌..

  • మోదీ కామెంట్స్‌..
  • వారికే ఖాళీ చెక్కు ఇచ్చేస్తున్నాం..  
  • బిల్లు ఆమోదం పొందాక ప్రభుత్వ ఖర్చుతో ప్రతిపక్షాలకు ప్రచారం చేస్తాం
  • హోర్డింగ్‌లపై విపక్ష నాయకుల ఫొటోలు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం
  • రిజర్వేషన్ల అమలును మీరు వ్యతిరేకిస్తే మాకే రాజకీయ ప్రయోజనం  
  • 2024లో తక్కువ సమయం ఉండడం వల్లే రిజర్వేషన్లు అమలు చేయలేకపోయాం
  • 2029లో కూడా రిజర్వేషన్లు కల్పించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు  
  • పునర్విభజనలో ఏ ఒక్క రాష్ట్రంపైనా వివక్ష చూపే ప్రసక్తే లేదు  
  • లోక్‌సభ స్థానాల నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదు  
  • లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ  
2026-04-17 07:21:13

నేడే ఓటింగ్‌.. మోదీ సర్కార్ గట్టెక్కేనా?

  • నేడే ఓటింగ్‌.. మోదీ సర్కార్ గట్టెక్కేనా?
  • మహిళా బిల్లుపై లోక్‌సభలో నేడే ఓటింగ్‌
  • ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి..  
  • మోదీ సర్కారు ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ
  • రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు
  • డివిజన్‌ అనంతరం చర్చకు స్వీకరించిన లోక్‌సభ
  • మరో రెండు బిల్లులను కూడా ప్రవేశపెట్టిన కేంద్రం
  • అర్ధరాత్రి దాకా చర్చ..
  • అధికార– విపక్షాల వాగ్యుద్ధం
2026-04-17 07:05:14
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement