Live Updates
‘సర్’పై పట్టు.. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
- ‘సర్’పై పట్టు.. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
- ఎస్‌ఐఆర్‌పై చర్చకు విపక్షాల పట్టు
- పెద్దల సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్
- రాజ్యసభ రేపటికి వాయిదా..
వాడివేడిగా రాజ్యసభ
- వాడివేడిగా సాగుతున్న రాజ్యసభ
- ఎస్‌ఐఆర్‌పై చర్చకు విపక్షాల పట్టు
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు
లోక్‌సభ రేపటికి వాయిదా
విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అనుమతించకపోవడంతో విపక్ష సభ్యులు సభలో నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. సభ సజావుగా కొనసాగే పరిస్థితులు లేకపోవడంతో స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు: సుభాష్ చంద్రబోస్
- రాజ్యసభలో చైర్మన్ రాధాకృష్ణన్‌కు అభినందన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్
- వైఎస్ జగన్ తరఫున సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు
- దశాబ్దాల సంస్థాగత వ్యవహారాల అనుభవం ఈ రాజ్యసభ నడిపేందుకు ఉపయోగపడుతుంది
- దేశంలో అత్యున్నత రెండో పదవికి చేరుకోవడం ప్రజాస్వామ్యం గొప్పతనం
- గవర్నర్‌గా ఆయన అద్భుతంగా పనిచేశారు
- నిర్మాణాత్మకంగా సభా కార్యక్రమాలు నిర్వహిస్తారని విశ్వాసం ఉంది
- బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సభ కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తాం
ఓట్లను తొలగించడానికే ఎస్‌ఐఆర్: అఖిలేష్
- సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కామెంట్స్..
- మన ఓటు హక్కును మన నుండి లాక్కోనప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
- ఎస్‌ఐఆర్‌పై ఉన్న ఆందోళన నేడు నిజమవుతోంది.
- ఓటు కోత విధిస్తే ఒక వ్యక్తి తన కలను ఎలా నెరవేర్చుకుంటాడు.
- ఎస్‌ఐఆర్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కాదు.
- ఓట్లను తొలగించడానికి ఉద్దేశించపడింది.
- యూపీలో వెంటనే ఎన్నికలు లేనప్పుడు ఈ తొందర ఎందుకు?.
#WATCH | Samajwadi Party MP Akhilesh Yadav says, "...Democracy will become stronger only when our right to vote is not snatched from us...The worry over SIR is becoming real today. If a vote is cut, then how will a person fulfill his/her dream...I have got information that… pic.twitter.com/xLNR8MlSVQ
— ANI (@ANI) December 1, 2025
ధన్కడ్ రాజీనామాపై ఖర్గే విచారం
- ధన్కడ్ రాజీనామాపై ఖర్గే విచారం
- మాజీ ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామాపై రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఖర్గే విచారం
- ఆయనకు వీడ్కోలు పలికే అవకాశం కూడా సభకు రాలేదని ఆవేదన
- ప్రధాని మోదీ ప్రసంగంపై స్పందిస్తూ
- పార్లమెంట్‌లో సమస్యలను ప్రస్తావించకుండా ప్రధాని డ్రామా
- 11 ఏళ్ల నుంచి పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీస్తున్న అధికారపక్షం
- ఈ వ్యాఖ్యలకు స్పందించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
- వీడ్కోలు అంశం సంబంధం లేని విషయమని వెల్లడి
#WATCH | Delhi: Rajya Sabha LoP Mallikarjun Kharge says, "...I hope you will not mind that I am constrained to refer to your predecessor's completely unexpected and sudden exit from the office of the Chairman, Rajya Sabha. The Chairman, being custodian of the entire house,… pic.twitter.com/5UOzKhJgKk
— ANI (@ANI) December 1, 2025
కీలక బిల్లులను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
- కీలక బిల్లులను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
- లోక్ సభలో ఆరోగ్య భద్రత, జాతీయ భద్రత సెస్ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
- ఆరోగ్య భద్రత, జాతీయ భద్రత నిధుల కోసం నూతనంగా సెస్ విధించబోతున్న కేంద్రం
లోక్‌సభ మళ్లీ వాయిదా
- లోక్‌సభ మళ్లీ వాయిదా
- ఎస్‌ఐఆర్(ఓటర్ల జాబితా క్రమబద్దీకరణ)పై చర్చకు విపక్షాల పట్టు
- చర్చిద్దామని.. ముందు ప్రశ్నోత్తరాలకు సహకరించాలని కోరిన స్పీకర్
- విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం
- ఆ గందరగోళం నడుమే బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రయత్నం
- సభ్యుల నినాదాలు ఎక్కువ కావడంతో మరింత గందరగోళం
- మధ్యాహ్నాం 2గం. దాకా వాయిదా
విపక్షాల ఆందోళనల నడుమే..
- వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభ
- ఎస్‌ఐఆర్‌పై చర్చకు పట్టుబడుతూ విపక్షాల ఆందోళన
- ఓట్ చోర్ అంటూ నినాదాలు చేస్తున్న విపక్ష సభ్యులు
- ఆందోళనల నడుమే కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
- బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- లోక్‌సభలో తీవ్ర గందరగోళం
విపక్షాలపై స్పీకర్ ఓం బిర్లా అసహనం.
- విపక్షాలపై స్పీకర్ ఓం బిర్లా అసహనం.
- అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం.
- ప్రజలకు సభకు పంపింది నినాదాలు చేయడానికి కాదు.
- ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలి.
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్
- మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్
- మోదీ వ్యాఖ్యలపై ప్రియాంక స్పందిస్తూ..
- ప్రధాని మోదీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని నేను భావిస్తున్నాను.
- ప్రజా సమస్యలు ప్రస్తావించడం డ్రామానా?.
- చర్చలు జరగకుండా డ్రామాలు ఆడేది ప్రభుత్వమే.
- కీలకమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి.
- ఇది మన దేశ రాజధాని నగరం.
- రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, మనం కొన్ని బలమైన చర్యలు తీసుకోవాలి.
- మన పిల్లలకు మనం దీన్ని ఎలా చేయగలం?
- నేడు 22 లక్షల మంది పిల్లలు ఊపిరితిత్తులకు శాశ్వతంగా దెబ్బతిన్నారని ఒక అధ్యయనం తెలిపింది.
- వృద్ధులు, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బాధపడుతున్నారు.
- ఆసుపత్రులు శ్వాసకోశ సమస్యలతో నిండి ఉన్నాయి.
- మనం దాని గురించి ఏమీ చేయకుండా ఎలా కూర్చోగలం?.
- ప్రభుత్వం అలా చేస్తే మేము వారికి మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
- కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి.
#WATCH | Delhi | On pollution, Congress MP Priyanka Gandhi Vadra says, "I feel this is a shameful situation. This is the capital city of our country. Let us set aside our political differences, and we should take some strong steps. How can we do this to our children? There are 22… pic.twitter.com/M6sxfnSUn5
— ANI (@ANI) December 1, 2025
లోక్‌సభలో విపక్షాల ఆందోళన..
- లోక్‌సభలో విపక్షాల ఆందోళన..
- ఎస్‌ఐఆర్‌పై చర్చకు విపక్ష సభ్యుల పట్టు.
- ఎస్‌ఐఆర్‌తో ఓట్లు తొలగిస్తున్నారని ఆందోళన.
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయవద్దంటూ నినాదాలు
- మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ వాయిదా.
#ParliamentWinterSession | Lok Sabha has been adjourned till 12 noon, following a ruckus by the opposition over the demand for discussions during the Zero Hour. pic.twitter.com/7QtSjMNeIS
— ANI (@ANI) December 1, 2025
రాజ్యసభ చైర్మన్‌పై మోదీ ప్రశంసలు
- ఇటీవల మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ సంతాపం.
- రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్.
- కొత్త చైర్మన్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ.
- రాజ్యసభలో మోదీ ప్రసంగం
- వరల్డ్‌కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు.
- రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు మోదీ అభినందనలు.
- రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు.
- ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు.
- తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా రాధాకృష్ణన్ పనిచేశారు.
- కొత్త చైర్మన్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉండటం గర్వంగా భావిస్తున్నా.
- మీ అనుభవం సభకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా.
- సభ్యులంగా సభా హుందాతనాన్ని కాపాడాలి.
- అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు సార్థకత.
- పెద్దల సభ గౌరవాన్ని కాపాడేలా సభ్యులు వ్యవహరించాలి.
#WATCH | Delhi: In Rajya Sabha, PM Narendra Modi says, "I assure you that all the members sitting in this House, while maintaining the dignity of the Upper House, will always take care of your dignity as well. I assure you that they will maintain decorum. Our Chairman comes from… pic.twitter.com/7fNaSxd9qa
— ANI (@ANI) December 1, 2025
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
- పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
- ఎస్‌ఐఆర్‌పై నిలదీసేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు.
- ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం.
- 13 బిల్లులను సభ ముందుకు తీసుకురానున్న కేంద్రం.
సభలో డ్రామాలు చేయకండి: ప్రధాని మోదీ
- పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ ప్రసంగం.
- పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నాం.
- ఈ సమావేశాల్లో దేశం కోసం పార్లమెంట్ ఏం చేస్తుందో తెలియజేయాల్సి ఉంది.
- మా ప్రధాన లక్ష్యం భారత్ అభివృద్ధి మాత్రమే.
- భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం మొత్తం చూస్తోంది.
- వికాస్, ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
- భారత వృద్ధి అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు.
- పార్లమెంట్ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలి.
- ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాం.
- సమస్యలు ప్రస్తావించేందుకు చాలా మంది ఎంపీలకు అవకాశం దక్కడం లేదు.
- తొలిసారి సభలో అడుగుపెట్టిన వారికి అవకాశం ఇవ్వాలి.
- డ్రామాలు చేసేందుకు ఎన్నో వేదికలు ఉంటాయి.
- సభలో డ్రామాలు చేయకండి.
- ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కూడా కీలక పాత్ర.
- పరాజయాన్ని కూడా అంగీకరించే మనసు ప్రతిపక్షానికి లేదు.
- సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి.
- పదేళ్లుగా వీళ్లు ఆడుతున్న ఆటలను దేశ ప్రజలు నమ్మడం లేదు.
- ఓటమి బాధతో పార్లమెంటును అడ్డుకోవాలని చూస్తున్నారు
- రాబోయే పరాజయాల కోసం పార్లమెంటును వాడుకోవాలని చూస్తున్నారు
- కొత్త ఎంపీల హక్కులను హరిస్తున్నారు
- పరాజయాల భారాన్ని ఎంపీలపై వేయవద్దు
- ప్రజలు ఇచ్చిన బాధ్యతను పార్లమెంట్లో ఎంపీలు నెరవేర్చాలి
- భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలే శక్తి.
- బీహార్‌లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలపరిచారు.
- వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.
#ParliamentWinterSession | Delhi: PM Narendra Modi says, "Negativity may be useful in politics. But ultimately, there should be some positive thinking for nation-building. I expect you to keep negativity within limits and focus on nation-building."
"This winter session is also… pic.twitter.com/xCPIOba4XS— ANI (@ANI) December 1, 2025
ప్రతిపక్ష నేతల సమావేశం.
- పార్లమెంట్ భవనంలో ప్రతిపక్ష నేతల సమావేశం.
- రాజ్యసభలో ప్రతిపక్ష నేతల మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో మీటింగ్.
- ఎస్‌ఐఆర్, ఢిల్లీ పేలుడు, వాయుకాలుష్యం వంటి అంశాలపై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపూ చర్చ.
#ParliamentWinterSession | Delhi: INDIA Bloc Floor Leaders' met at the office of Rajya Sabha LoP Mallikarjun Kharge, in the Parliament House complex.
Source: AICC https://t.co/jhk5YgcHr3 pic.twitter.com/tYV2SLP9ag— ANI (@ANI) December 1, 2025
దేశ భద్రతపై చర్చ జరగాలి: చామల కిరణ్ కుమార్ రెడ్డి
- కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు..
- దేశ భద్రతపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరగాలి
- ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది
- ఎస్ఐఆర్ పేరిట ప్రజల ఓటు హక్కును కాలారాసే ప్రయత్నం చేస్తున్నారు
- సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి
- దేశ రాజధాని ఢిల్లీలో సెక్యూరిటీ ఆఫ్ హెల్త్ పైన పార్లమెంట్ లో చర్చ చేయాలి
- నేను ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో AQI లెవెల్ 272 ఉంది.
- వారం రోజుల క్రితం ఢిల్లీలో 390 దాటింది
- ఢిల్లీతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ నగరాలు కాలుష్య బారిన పడుతున్నాయి
- తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు,పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించాలి
- కేంద్ర ప్రభుత్వం తమకు ఇష్టం ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు
- కేంద్ర ఆయా రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం చేయాలని కోరుతున్నాము.
- ఇప్పటి వరకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు
- పంటలు నష్టపోయిన రైతులకు కేంద్రం ఆర్ధిక సహాయం చేయలేదు
- పార్లమెంట్ శీతాకాల సమావేశాలను మమా అనిపించాలని ఎన్డీయే, బీజేపీ ప్రభుత్వం చూస్తోంది
- ప్రజా సమస్యలపై విపక్ష పార్టీల ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాము
పలు అంశాలపై కాంగ్రెస్ డిమాండ్..
- శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో భారీ సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకురానుంది.
- వీటిలో అణు ఇంధనం, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్, బీమా,
- జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం-రాజీ చట్టాల సవరణ బిల్లులు ఉన్నాయి.
- ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంటులో చర్చించాలని మెజార్టీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
- ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి.
- ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, విదేశాంగ విధానం, రైతుల సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యంపైనా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్
- కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేందుకు సుముఖంగా లేదనే విషయం అఖిలపక్ష సమావేశంలో అర్థమైందన్న కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
- ఎస్‌ఐఆర్‌పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది.
కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
- కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
- కేంద్ర ప్రభుత్వం మొత్తం 10 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధంకాగా..
- ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి.
- ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, రైతు సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశాయి.
- నేటి నుంచి 19వ తేదీ వరకూ మొత్తం 15 రోజులపాటు ఉభయ సభలు సమావేశం కానున్నాయి.


