తొమ్మిది స్థానాలే కీలకం.. ఎన్డీయే హోరాహోరీ | Special Political Story On Kerala Elections Over 9 Segments | Sakshi
Sakshi News home page

తొమ్మిది స్థానాలే కీలకం.. ఎన్డీయే హోరాహోరీ

Mar 28 2026 7:58 AM | Updated on Mar 28 2026 12:50 PM

Special Political Story On Kerala Elections Over 9 Segments
  • తొమ్మిది చోట్ల ముక్కోణం
  • కేరళలో ఆసక్తికర పోరు
  • ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీయే హోరాహోరీ
  • ఇక్కడి గెలుపోటములు తుది ఫలితాలను నిర్దేశించే ఆస్కారం

కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్‌ కూటములు హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో 9 అసెంబ్లీ స్థానాల్లో మూడు కూటముల నడుమ నెలకొన్న ముక్కోణపు పోరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ స్థానాల్లో గెలుపోటములు మొత్తంగా ఎన్నికల ఫలితాలనే  నిర్దేశించవచ్చని పరిశీలకులు భావిస్తుండటం విశేషం.

నీమమ్‌
తిరువనంతపురం జిల్లాలో ఉంది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా బీజేపీ నెగ్గిన ఏకైక అసెంబ్లీ స్థానం కావడం విశేషం. 2016లో ఎల్డీఎఫ్‌కు చెందిన కె.శివన్‌కుట్టిపై బీజేపీ సీనియర్‌ నేత ఒ.రాజగోపాల్‌ విజయం సాధించారు. అనంతరం 2021 ఎన్నికల్లో శివన్‌కుట్టి కేవలం 3,949 ఓట్ల మెజారిటీతో బీజేపీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖరన్‌ను బరిలో దించింది. ఎల్డీఎఫ్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శివన్‌కుట్టి, యూడీఎఫ్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.శబరీనందన్‌ పోటీలో ఉన్నారు.

కళక్కొట్టం 
బీజేపీ బలంగా కనిపిస్తున్న మరో అసెంబ్లీ స్థానమిది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్‌ మరోసారి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యరి్థగా బీజేపీ సీనియర్‌ నేత వి.మురళీధరన్‌ నిలిచారు. 2016లో సురేంద్రన్‌ చేతిలో ఆయన కేవలం 7,347 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇటీవలి తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించి దూకుడు మీదున్న బీజేపీ ఈసారి కళక్కొట్టం తమ ఖాతాలో చేరడం ఖాయమని ధీమాగా ఉంది. యూడీఎఫ్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే టి.శరచ్ఛంద్ర ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు.

వట్టియుర్కవు
ఇది కూడా బీజేపీకి మంచి పట్టున్న స్థానమే. 2016, 2012 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. కానీ 2019 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్‌ నుంచి ప్రశాంత్‌ హ్యాట్రిక్‌ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా నెగ్గాలని భావిస్తున్న బీజేపీ మాజీ డీజీపీ ఆర్‌.శ్రీలేఖను బరిలో దించింది. 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించిన కె.మురళీధరన్‌నే యూడీఎఫ్‌ ఈసారీ పోటీకి పెట్టింది.

మంజేశ్వరం
బీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్‌ నేత కె.సురేంద్రన్‌ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్‌ను ఓడించి తీరతానని సురేంద్రన్‌ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్‌ తరఫున కె.ఆర్‌.జయనంద బరిలో ఉన్నారు.

పాల 
చారిత్రకంగా ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. ఈసారి మాత్రం కథ మారింది. ఎల్డీఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌ (మణి) చైర్మన్‌జోస్‌ కె.మణి బరిలో ఉన్నారు. యూడీఎఫ్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మణి సి.కప్పన్‌తో తలపడుతున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా బాగా ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే పి.సి.జార్జి కుమారుడు షోన్‌ జార్జిని బరిలో దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

నట్టిక
గత ఎన్నికల్లో సీపీఐ తరఫున నెగ్గిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే సి.సి.ముకుందన్‌ ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో దిగుతుండటం ఆసక్తికరం. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత ఆదరణ బాగా కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎల్డీఎఫ్‌ ఈసారి మాజీ ఎమ్మెల్యే గీతా గోపీకి టికెటిచ్చింది. యూడీఎఫ్‌ నుంచి కూడా సునీల్‌ లాలూర్‌ రూపంలో గట్టి అభ్యర్థి బరిలో ఉండటంతో పోరు హోరాహోరీగా మారింది.  మంజేశ్వరం బీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్‌ నేత కె.సురేంద్రన్‌ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్‌ అభ్యరి్థ, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్‌ను ఓడించి తీరతానని సురేంద్రన్‌ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్‌ తరఫున కె.ఆర్‌.జయనంద బరిలో ఉన్నారు.

అరన్ముల
పత్థనంతిట్ట జిల్లాలోని ఆలయ నగరమైన ఈ స్థానంపై కూడా బీజేపీ గట్టి ఆశలే పెట్టుకుంది. అరన్ముల విమానాశ్రయ ఆందోళనలతో మంచి జనాదరణ పొందిన రాజశేఖరన్‌ను బరిలో దించింది. ఎల్డీఎఫ్‌ నుంచి హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన ఆరోగ్య మంత్రి వీణా జార్జిని ఆయన ఢీకొడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ ఈసారి వ్యూహాత్మకంగా అబిన్‌ వర్కుకి టికెట్‌ ఇచ్చింది. గత రెండు ఎన్నికల్లో వీణా జార్జికి దన్నుగా నిలిచిన పలు సామాజికవర్గాలకు చెందిన ఓటర్లను ఆయన కాంగ్రెస్‌వైపు తిప్పగలరని పార్టీ ఆశపడుతోంది.

త్రిసూర్‌
గత ఎన్నికల్లో ఇక్కడ అధికార, విపక్ష కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎల్డీఎఫ్‌ నుంచి సీపీఎం అభ్యర్థి పి.బాలచంద్రన్‌ కేవలం 946 ఓట్లతో గట్టెక్కారు. ఎన్డీఏ తరఫున సినీ నటుడు సురేశ్‌గోపి గట్టి పోటీ ఇచ్చినా మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్‌ స్థానం నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో బీజేపీకి దక్కిన తొలి లోక్‌సభ స్థానం అదే కావడం విశేషం. బీజేపీ ఈసారి సీనియర్‌ నాయ కుడు వేణుగోపాల్‌కు టికెట్‌ ఇచ్చింది. ఎల్డీఎఫ్‌ నుంచి అలంకొడె లీలాకృష్ణన్, యూడీఎఫ్‌ నుంచి మాజీ మేయర్‌ రాజన్‌ పల్లన్‌ పోటీలో ఉన్నారు.

పాలక్కాడ్‌
ఇక్కడ ఎల్డీఎఫ్, బీజేపీ తెర వెనక కుమ్మక్కయ్యాయని విపక్ష నేత వి.డి.సతీశన్‌ విమర్శలతో వాతావరణం బాగా వేడెక్కింది. యూడీఎఫ్‌కు పడే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఎల్డీఎఫ్‌ కావాలనే హోటల్‌ వ్యాపారి ఎన్‌ఎంఆర్‌ రజాక్‌కు టికెటిచి్చందని సతీశన్‌ ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ‘మెట్రో మ్యాన్‌’ఇ.శ్రీధరన్‌కు టికెటిచి్చంది. ఆయన కేవలం 3,859 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి షఫీ పరంబిల్‌ చేతిలో ఓటమి చవిచూశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచిన శోభా సురేంద్రన్‌కు బీజేపీ ఈసారి టికెటిచి్చంది. షఫీ లోక్‌సభకు వెళ్లడంతో 2021లో ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాహుల్‌ మమ్కూతటిల్‌ నెగ్గారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ ఈసారి ఆయన్ను పక్కన పెట్టి రమేశ్‌ పిశరోడికి టికెట్‌ ఇచ్చింది.   

Advertisement
 
Advertisement
Advertisement