సీఎం హిమంత పోటీ.. కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ | EC Rejects Congress Nominations In Assam, Setback For Party In Key Constituencies, More Details Inside | Sakshi
Sakshi News home page

సీఎం హిమంత పోటీ.. కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

Mar 25 2026 8:42 AM | Updated on Mar 25 2026 10:04 AM

Congress Candidate Nomination Reject At Assam

గువాహటి: బీజేపీ పాలిత అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బరిలో నిలిచిన జలూక్‌బారీలో కాంగ్రెస్‌ అభ్యర్థి బిదిషా నియాంగ్‌ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. అయితే తిరస్కరణకు కారణాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో ప్రస్తావించలేదు. మరోవైపు హాఫ్లాంగ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మల్‌ లాంగ్‌థాసా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది.

అయితే అదే స్థానంలో పోటీకి నిలిచిన మరో కాంగ్రెస్‌ నాయకురాలు నందితా గార్లోసా నామినేషన్‌ను ఈసీ ఆమోదించింది. బీజేపీ టికెట్‌ నిరాకరించడంతో ఆదివారమే ఆమె కాంగ్రెస్‌లో చేరి వెంటనే నామినేషన్‌ వేశారు. ధకౌఖానాలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనంద నరాహ్‌ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. 126 స్థానాలున్న శాసనసభ ఎన్నికల కోసం 815 మంది అభ్యర్థుల నుంచి 1,389 నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయి. పలువురు ఒకటి కంటే ఎక్కువ సెట్‌ల పేపర్లను సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటిదాకా గడువు ఉంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement