భారత బోర్డర్‌.. బెంగాల్‌ సీఎం సంచలన నిర్ణయం | Bengal CM Suvendu Land Allocation To BSF Fencing | Sakshi
Sakshi News home page

భారత బోర్డర్‌.. బెంగాల్‌ సీఎం సంచలన నిర్ణయం

May 11 2026 12:58 PM | Updated on May 11 2026 1:12 PM

Bengal CM Suvendu Land Allocation To BSF Fencing

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. మన దేశ బోర్డర్‌లో రక్షణ కోసం బీఎస్‌ఎఫ్‌కు ల్యాండ్‌ బదిలీ చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 127 కిలోమీటర్ల మేర బీఎస్‌ఎఫ్‌ కోసం కేంద్ర హోంశాఖ ఫెన్సింగ్‌ వేయనుంది. రానున్న 45 రోజుల్లో బీఎస్‌ఎఫ్‌కు తగిన భూమిని అప్పగించనున్నట్టు సీఎం సువేందు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఎస్‌ఎఫ్‌ (BSF) కోసం సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి భూమి కేటాయింపులు ప్రారంభించింది. తాజాగా సీఎం సువేందు అధికారి బంగ్లాదేశ్‌ సరిహద్దు వద్ద ఫెన్సింగ్‌ కోసం భూమి బదిలీకి ఆమోదం తెలిపారు. అయితే, కలకత్తా హైకోర్టు ఇప్పటివరకు కేటాయింపులు ఆలస్యం కావడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. కాగా, గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం బీఎస్‌ఎఫ్‌కు భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపించారని ఆరోపణలు ఉన్నాయి. 127 కిలోమీటర్లకు గాను.. కేవలం 8 కిలోమీటర్లే మమత సర్కార్‌ కేటాయింపులు చేసింది. 

ప్రభావం ఇలా.. 
సరిహద్దు భద్రత: బంగ్లాదేశ్‌ సరిహద్దు వద్ద అక్రమ రవాణా, చొరబాటు తగ్గించడానికి ఫెన్సింగ్‌ కీలకం.

బీఎస్‌ఎఫ్‌ బలోపేతం: కొత్త అవుట్‌పోస్టులు, ఫెన్సింగ్‌ వల్ల BSFకు పర్యవేక్షణ సులభం అవుతుంది.

రాజకీయ ప్రభావం: సువేందు అధికారి ప్రభుత్వం బీఎస్‌ఎఫ్‌కు మద్దతు ఇస్తూ, కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement