రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు | BJP MLA Adinarayana Reddy Sensational Comments Over CBN Govt | Sakshi
Sakshi News home page

రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Apr 7 2026 12:30 PM | Updated on Apr 7 2026 3:23 PM

BJP MLA Adinarayana Reddy Sensational Comments Over CBN Govt

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఏపీలో కూటమి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయటపడింది.

జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇతర శాఖల్లోనూ పనులు నడవడం లేదు. ప్రజలకు మేలు చేయలేనప్పుడు ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో నాకేం పదవులు అవసరం లేదు.. ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కూటమి పాలనలో కమ్మని ప్రభుత్వం అన్నందుకు ఆదినారాయణరెడ్డిపై కూటమి నేతలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరో మారు బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కూటమి ప్రభుత్వం వేస్ట్.. రాజీనామాకు రెడీ

Advertisement
 
Advertisement
Advertisement