జిల్లా కళాకారుడికి ప్రశంస
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన వర్ధమాన గాయకుడు, సంగీత బృందం నిర్వాహకుడు రాజుల నాగరాజును గానకోకిల, ప్రముఖ సీనియర్ సినీ నేపథ్య గాయని పి.సుశీలమ్మ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో శనివా రం నిర్వహించిన కార్యక్రమంలో నాగరాజు తన ఆర్కెస్ట్రా బృందంతో కలిసి సుశీలమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగరాజు ప్రతిభను అభినందించిన సుశీలమ్మ, సంగీత రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. జిల్లాకు చెందిన నాగరాజు ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమవుతున్న సంగీత కార్యక్రమాల్లో తన గానంతో ప్రేక్షకులను అలరిస్తూ గుర్తింపు పొందుతున్నారు.
సుశీలమ్మతో జిల్లా కళాకారుడు నాగరాజు


