యాప్‌లో యూరియా.. ఇలా ఈజీ | - | Sakshi
Sakshi News home page

యాప్‌లో యూరియా.. ఇలా ఈజీ

Feb 22 2026 7:03 AM | Updated on Feb 22 2026 7:03 AM

యాప్‌

యాప్‌లో యూరియా.. ఇలా ఈజీ

● స్మార్ట్‌ ఫోన్‌తో ఇంటి నుంచే బుకింగ్‌ ● రైతులకు సులభ మార్గం ● ప్లే స్టోర్‌లో ’ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌’ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.. ● మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఓటీపీతో వెరిఫై చేయండి. ● పట్టాదార్‌ పాస్‌బుక్‌ లింక్‌తో సాగు భూ మి, పంట వివరాలు ఎంటర్‌ చేయాలి. ● అర్హత ప్రకారం బ్యాగుల సంఖ్య చూపిస్తుంది. బుక్‌ చేసి హిస్టరీలో ట్రాక్‌ చేయండి. ● మొబైల్‌ లింక్‌ లేకపోతే వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.

ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారా అన్నదాతల వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా యూరియాను కేటాయిస్తారు. ఎకరం వరి పంట సాగుకు 3 సంచులు, ఎకరం మొక్కజొన్నకు 4 సంచులు, ఇంతర పంటలకు 2 సంచులు ఇస్తారు. ఎకరంలోపు ఉన్న రైతులకు ఒకేసారి రెండు నుంచి మూడు సంచులు కేటాయిస్తారు.

ఎకరా మించి ఉంటే రెండు విడతల్లో, 5 ఎకరాలకన్నా ఎక్కువ ఉంటే మూడు విడతల్లో, 20 ఎకరాలకు మించి ఉంటే నాలుగు విడతల్లో యూరియా కేటాయిస్తారు.

ఒక రైతు ఒకసారి యూరియాను తీసుకున్న తర్వాత మళ్లీ 15 రోజుల వరకు తీసుకునే అవకాశం ఉండదు.

బుక్‌ చేసుకున్న 48 గంటల్లో యూరియా తీసుకోవాలి. లేదంటే బుకింగ్‌ క్యాన్సల్‌ అవుతుంది.

ఈ యాప్‌ ద్వారా జిల్లాలో ఎన్ని యూరియా బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మండలంలో ఏయే ఫర్టిలైజర్‌ షాప్‌లలో ఎన్ని బ్యాగులు ఉన్నాయి తెలుసుకోవచ్చు.

లక్ష్మణచాంద: అన్నదాతలకు యూరియా కష్టాలను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ రైతులు సులభంగా ఇంటి నుంచే యూరియాను బుక్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా అన్నదాతలు ఎక్కడ నుంచి అయినా యూరియాను బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. షాప్‌ బయట లైన్‌లో నిలబడే సమస్య ఉండదు. యాప్‌ ద్వారా జిల్లా, మండల స్థాయిలో స్టాక్‌ వివరాలు కూడా తెలుస్తాయి.

బుకింగ్‌ ప్రక్రియ..

సందేహాలుంటే సంప్రదించాలి..

యూరియా బుకింగ్‌పై అన్నదాతలకు ఎలాంటి సందేహాలు ఉన్నా క్లస్టర్ల పరిదిలోని ఏఈవోలను సంప్రదించాలి. మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ అనుసంధానం లేకున్నా ఏఈవోలను సంప్రదిస్తే వెంటనే లింక్‌ చేయడంతోపాటు యూరి యా బుకింగ్‌ చేయిస్తారు. యూరియా బుకింగ్‌పై ఎటువంటి ఆందోళన వద్దు. వ్యవసాయ శాఖ

అండగా ఉండి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. – వసంత్‌రావు, ఏవో

విస్తీర్ణం ఆధారంగా బస్తాలు..

యాప్‌లో యూరియా.. ఇలా ఈజీ1
1/1

యాప్‌లో యూరియా.. ఇలా ఈజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement