● ఆటల్లో సత్తా చాటుతున్న కేజీబీవీ విద్యార్థినులు ● మండల
నేను మా ఇంటివద్ద క్రికెట్‌తోపాటు కబడ్డీ, కిక్‌బాక్సింగ్ ఆటలు బాగా చూసేదాన్ని. కిక్‌బాక్సింగ్‌పై మక్కువ ఏర్పడింది. అప్పట్నుంచి బాక్సింగ్‌లో రాణించాలన్న కల ఉండేది. గురుకులం మంచి వేదికగా మారింది. మా పీడీ, పీఈటీలు నా ఆసక్తికి అనుగుణంగా మెలకువలు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం సీఎం కప్‌పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాను.
– బి తేజశ్విని, కిక్‌బాక్సింగ్ క్రీడాకారిణి
మేము పదో తరగతి చదువుతున్నాం. క్యారమ్స్ డబుల్స్‌లో మేము ఉత్తమ ప్రతిభ కనబర్చాం. మండల, నియోజకవర్గ
స్థాయిలో పోటీల్లో ప్రథమ స్థానం సాధించాం. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాం. రాష్ట్రస్థాయిలో క్యారమ్స్ డబుల్ విభాగంలో మెడల్ సాధిస్తాం.
– రిషిత, నవ్యశ్రీ, కేజీబీవీ, లక్ష్మణచాంద
లక్ష్మణచాంద/సారంగాపూర్: ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు. కృషి, పట్టుదల, సాధన ఉంటే.. ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఇదే సూత్రాన్ని పాటిస్తూ అటు చదువులో.. ఇటు ఆటల్లో రాణిస్తున్నారు లక్ష్మణచాంద, సారంగాపూర్ కేజీబీవీ విద్యార్థులు. ఇటీవల ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీల్లో మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చారు. వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. లక్ష్మణచాంద కేజీబీవీ నుంచి 32 మంది, సారంగాపూర్ కేజీబీవీ నుంచి 15 మంది వివిధ క్రీడాంశాల్లో రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హాండ్‌బాల్, బ్యాడ్మింటన్, కిక్‌బాక్సింగ్, జావెలిన్‌త్రో, వెయిట్‌లిఫ్టింగ్, క్యారమ్స్, కరాటే తదితర పోటీల్లో తమదైన ఆటతీరు ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణతో వివిధ క్రీడల్లో ప్రతిభ చాటుతూ పాఠశాలకు మంచి పేరు తెస్తున్నారు. వీరిపై సండే స్పెషల్.
వెయిట్‌లిఫ్టింగ్‌లో..
సారంగాపూర్ మండలం జామ్ కేజీబీవీలో ఇంటర్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న సంహిత 32 కేజీల విభాగంలో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించారు. జిల్లాస్థాయి పోటీల్లోనూ పోటీపడి అద్భుత ప్రదర్శన కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రదర్శనకబర్చి మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.
బాక్సింగ్ వీడియోలు చూస్తూ..
● ఆటల్లో సత్తా చాటుతున్న కేజీబీవీ విద్యార్థినులు ● మండల
● ఆటల్లో సత్తా చాటుతున్న కేజీబీవీ విద్యార్థినులు ● మండల
● ఆటల్లో సత్తా చాటుతున్న కేజీబీవీ విద్యార్థినులు ● మండల


