డ్రైవర్లు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి
లక్ష్మణచాంద: లాంగ్ డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా మధ్యలో విశ్రాంతి తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాంగ్ డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతీ నాలుగైదు గంటలకు ఒకసారి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలన్నారు. మధ్యలో వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపి రిఫ్రెష్ అయి మళ్లీ ప్రయాణం కొనసాగించాలని సూచించారు. అలసటతో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్, సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సైలు గోపి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.


