స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లొకేషన్
లక్ష్మణచాంద: ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు తమ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తీసుకుంటున్నా రు. గతంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ కళాశాలల్లో పరీక్ష కేంద్రం ఉండటంతో జిల్లా కేంద్రానికి వెళ్లి పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో సరైన సమాచారం లేక ఇబ్బంది పడ్డారు. కొన్నిసార్లు సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య పరిష్కారాని కి ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్...
ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీనిని మొ బైల్ ఫోన్‌తో స్కాన్ చేయగానే విద్యార్థి పరీక్ష కేంద్ర ం లైవ్ లొకేషన్‌తోపాటు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు నిర్మల్ జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రంకు చేరుకోవడం సులభతరం అవుతుంది.
జిల్లాలో ఇలా...
జిల్లా వ్యాప్తంగా మొత్తం 69 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,652, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,479 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు అర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మొబైల్ ఫోన్‌కు సమాచారం...
ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్ తీసుకునే సమయంలో కార్పొరేట్ కళాశాలలో కళాశాల ఫీజులు చెల్లించాలని లేదంటే హాల్‌టికెట్ ఇవ్వమని చెప్పడంతో చాలామంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో పరీక్షలకు దూరమైన సందర్భాలు కోకొల్లాలు. నిరుపేద విద్యార్థులు ఇంటర్ విద్యకు దూరమవుతున్నారనే కారణంతో ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల పోషకుల ఫోన్‌కు ఇంటర్ హాల్‌టికెట్ బోర్డు లింకు పంపించారు. ఈ లింకు ఓపెన్ చేసి విద్యార్థి ఆధార్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయగానే విద్యార్థి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఇంటర్ బోర్డు కల్పించింది.
ఒత్తిడి తగ్గించేలా..
వార్షిక పరీక్షల సమయంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆందోళనకులోనై అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలకు సహాయం అందించేందుకు ఇంటర్‌బోర్డు టెలీ మానస్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఏ.విద్యార్థి అయినా మానసికంగా ఆందోళన చెందినా పోషకులు 14416 నంబర్‌కు ఫోన్ చేయగానే మానసిక నిపుణులు అందుబాటులోకి వచ్చి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తగిన సూచనలు సలహాలు అందిస్తారు. ఈ సహాయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.


