బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు అనంతరం అమ్మవారి దర్శనానికి క్యూలో బారులు తీరారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లిదండ్రులు చిన్నారులకు అర్చకులతో అక్షరాభ్యాసం చేయించారు. అలాగే కుంకుమార్చనలో మహిళలు పాల్గొన్నారు. సీఐ కిరణ్, ఎస్సై నవనీత్‌రెడ్డి, ఆలయ ఈవో అంజనాదేవి, ఏఈవో గంగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లుచేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భక్తులు వివిధ ఆర్జితసేవ, ప్రత్యేక అక్షరాభ్యాసం, చండీహోమం, అభిషేకం, లడ్డూ ప్రసాదం, పులిహోర మండపప్రవేశం, కుంకుమార్చన ద్వారా ఆలయానికి రూ.11,472,50 ఆదాయం సమకూరింది.
దాడిచేసిన నలుగురిపై కేసు
నెన్నెల: దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని చిత్తపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు చెల్కల భాస్కర్, మల్లక్కపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన వేముల రాజేష్, డోబ్బులు శంకరి, ఓరం మల్లయ్య, వేల్పుల సంపత్ దాడి చేశారు. మామిడితోటలో చెట్లు కత్తరింపు చేయిస్తున్న భార్యభర్తలపై దాడి చేసి దుర్బాషలాడి చంపుతామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


