బాక్సింగ్‌లో ప్రతిభ
నిర్మల్ టౌన్: మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ జూనియర్ బాలు రు, బాలికల బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు పాల్గొనగా.. ఇద్దరు బాక్సర్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, రెండు కాంస్య పతాకాలు సాధించారు. 44–46 కేజీల విభాగంలో ఆర్.అనన్య, 48–50 కేజీల విభాగంలో ఏ.కీర్తన కాంస్య పతకాలను సాధించారు. వీరిని జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, బాక్సింగ్ అసోసియేషన్ బాధ్యులు చందుల స్వామి, శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు.
రెజ్లింగ్‌లో రజతం
తానూరు: సీఎం కప్ రాష్ట్రసాయి రెజ్లింగ్ పోటీల్లో తానూరు జూనియర్ కళాశాల విద్యార్థులు రజత పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ రాజశేఖర్ తెలిపారు. హైదారాబాద్‌లో సోమవారం నిర్వహించిన రెస్లింగ్ పోటీలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు గంగాప్రసాద్ అండర్–17, 45 కేజీల విభాగంలో, శివప్రసాద్ అండర్–19, 52 కేజీల విభాగంలో ప్రతిభ కనబర్చి రజత పతకాలు సాధించినట్లు వివరించారు.
బాక్సింగ్‌లో ప్రతిభ


