‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 26 2026 7:25 AM | Updated on Feb 26 2026 7:25 AM

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

నిర్మల్‌రూరల్‌: మార్చి 14 నుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో దర్శనం భోజన్న అన్నారు. బుఽ దవారం జిల్లా కేంద్రంలోని సెయింట్‌ థామస్‌ హైస్కూల్‌లో జరిగిన చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ అధికారుల ఓరియంటేషన్‌ తరగతులకు హాజరై మాట్లాడారు. విద్యార్థులతో పాటు సీఎస్‌, డీవోలకు సెల్‌ఫోన్‌లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. గదిలో లైటు, ఫ్యాను ఉండేలా చూడాలన్నారు. దివ్యాంగులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే పరీక్ష గదిని కేటాయించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ ముడారపు పరమేశ్వర్‌ పరీక్ష నిర్వహణ తీరు గురించి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement