కవ్వాల్‌లో పక్షుల కిలకిలలు
కవ్వాల్ టైగర్‌జోన్‌లో ఇటికాస్ సంస్థ చేసిన సర్వేలో 264 పక్షులను గుర్తించారు. ఇందులో స్థానిక జాతులతోపాటు విదేశీ పక్షులు ఉండటం విశేషం.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
లక్ష్మణచాంద: ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేఎల్పీనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోరారు. బుధవారం సోన్ మండలంలోని సోన్, కూచన్‌పెల్లి, బొప్పారం, న్యూవెల్మల్ గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. వెయ్యి ఎకరాలకు పైనే పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకోవడం తప్పా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకూ పరిహారం చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సరికెల గంగన్న, మార గంగారెడ్డి, న్యూ వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, బొప్పారం సర్పంచ్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.


