పథకాలకు ఫార్మర్‌ రిజిస్ట్రీ! | - | Sakshi
Sakshi News home page

పథకాలకు ఫార్మర్‌ రిజిస్ట్రీ!

Feb 26 2026 7:25 AM | Updated on Feb 26 2026 7:25 AM

పథకాలకు ఫార్మర్‌ రిజిస్ట్రీ!

పథకాలకు ఫార్మర్‌ రిజిస్ట్రీ!

● ఐడీ ఉంటేనే కేంద్ర పథకాల లబ్ధి ● నెమ్మదించిన నమోదు ప్రక్రియ

నిర్మల్‌చైన్‌గేట్‌: కేంద్ర ప్రభుత్వం రైతులకు మరింత పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించేందుకు భూమి కలిగిన ప్రతీ రైతుకు 14 అంకెల యూనిక్‌ గుర్తింపు నంబర్‌ జారీ చేస్తోంది. ఆధార్‌లా పనిచేసే ఈ ఫార్మర్‌ ఐడీ డిజిటలైజేషన్‌ ప్రక్రియను గతేడాది మే 5న ప్రారంభించారు. రైతులు ఆధార్‌ కార్డు, భూ సంబంధిత పత్రాలు, లింక్డ్‌ మొబైల్‌ నంబర్‌తో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద లేదా మీ–సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. అధికారులు అగ్రిస్టాక్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తారు. మూడు ఓటీపీల ధ్రువీకరణ పూర్తయిన తర్వాత 14 అంకెల యూనిక్‌ ఐడీ కేటాయించబడుతుంది.

యూనిక్‌ నంబర్‌ ఉంటేనే..

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వనుంది. ఈ ఐడీ లేకుండా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, సాయిల్‌ హెల్త్‌ కార్డులు, ఫసల్‌ బీమా, ఎరువుల పంపిణీ వంటి కేంద్ర పథకాలు అందవు. రాయితీ రుణాలు, ఇతర సంక్షేమ సహాయాలకు కూడా ఇది ఆధారం. పట్టాదారు పాస్‌బుక్‌ కలిగినవారు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

ఈనెల 24 వరకు మండలాల వారీగా జరిగిన

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్ల వివరాలు

మండలం పట్టా రిజిస్టర్‌ అయిన శాతం

పాస్‌పుస్తకాలు రైతులు

లోకేశ్వరం 13,100 9,609 82.53

లక్ష్మణచాంద 9,711 6,595 78.01

నిర్మల్‌అర్బన్‌ 786 537 77.91

సోన్‌ 7,922 5,551 77.86

దస్తురాబాద్‌ 5,035 3,828 75.40

దిలావర్‌పూర్‌ 7,415 4,863 74.19

నర్సాపూర్‌(జి) 6,972 4,616 73.69

తానూర్‌ 15,306 10,678 72.92

సారంగాపూర్‌ 13,006 9,213 72.31

నిర్మల్‌రూరల్‌ 11,025 6,518 70.74

ముధోల్‌ 12,582 8,026 69.68

కుంటాల 8,333 5,108 66.71

ఖానాపూర్‌ 9,381 5,823 66.47

భైంసా 16,459 10,160 66.09

మామడ 9,819 6,461 64.21

కుభీర్‌ 17,657 10,987 62.91

బాసర 7,240 3,992 61.83

కడెం 11,380 6,857 60.59

పెంబి 3,784 2,937 49.93

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement