వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది.
ఇందిరమ్మ ఇంట్లో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు
ఖానాపూర్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంతో విలువైనదని, ఇందిరమ్మ ఇంట్లో ఉన్న వెడ్మ బొజ్జును కాంగ్రెస్ పార్టీ బీఫాం ఖానాపూర్ ఎమ్మెల్యేను చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. ఏపీ, తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ తరగతులకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదిలాబాద్ నాగోబా జాతరకు వెళ్లినప్పుడు సామాన్య కార్యకర్త యాక్టివ్‌గా ఉండడంతో అతని బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకున్నానన్నారు. వారి తల్లిదండ్రులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు అదే అతని బ్యాక్‌గ్రౌండ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీఫాం ఇవ్వడంతో ఎమ్మెల్యే అయ్యాడన్నారు. ఈ క్యాంప్‌లో పార్టీ సిద్దాంతాలు, చరిత్ర, సంస్థాగత నిర్మాణం, బూత్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా వినియోగం, ప్రజాసమస్యలపై పోరా టంపై అవగాహన కల్పించారు.
మాట్లాడుతున్న సీఎం, ఆసక్తిగా వింటున్న బొజ్జు
26న హిందూ మహాసభ సమ్మేళనం
నిర్మల్‌చైన్‌గేట్: వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న ముధోల్ మండల కేంద్రంలో మహాసభ సంతు సమ్మేళనం(హిందూ జూడో మహాసభ) నిర్వహించనున్నట్లు జిల్లా గౌరవ అధ్యక్షుడు గంగాధర్ పటేల్, అధ్యక్షులు శంకర్ పటేల్ తెలిపారు. నిర్మల్ వీరశైవ లింగాయత్ సంఘ భవనంలో జిల్లా కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ, లింగ ధర్మం ప్రచారం, మహా త్మ బసవేశ్వర ఆశయాలు, సమాజంలో శాంతి స్థాపనకు ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామని వివరించారు. సమ్మేళనానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాధువులు, మహరాజు లు, మహారుషులు హాజరవుతునారని తెలిపా రు. పెద్ద ఎత్తున వీరశైవ లింగాయత్ బంధువులు, ప్రజలు హాజరు కావాలని పేర్కొన్నారు.
వాతావరణం


