నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Feb 24 2026 7:47 AM | Updated on Feb 24 2026 7:47 AM

నిర్మ

నిర్మల్‌

వాతావరణం ఇఫ్తార్‌ 6:26 సహర్‌ 5:22 బుధ : మంగళ : 8లోu మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

వాతావరణం
ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. అల్పపీడనం ప్రభావంతో ఆకాశం మేఘావృతం అవుతుంది. అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉంది.
అకాల వర్షం.. ఆగమాగం

ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం

నెదర్లాండ్‌కు చెందిన శాశ్వత వ్యవసాయ నిపుణుడు సచాస్‌ స్టైమెస్‌ మండలంలో ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తున్న పంటలను పరిశీలించాడు.

భైంసా/భైంసాటౌన్‌/లక్ష్మణచాంద/లోకేశ్వరం/ఖానాపూర్‌: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో సోమవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. జిల్లాలో శెనగ పంట ప్రస్తుతం చేతికి వస్తోంది. వర్షాలకు శెనగలు నల్లబడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పంట కోసిన రైతులు తడవకుండా కుప్పలపై టార్పాలిన్లు కప్పుకున్నారు. భైంసా పట్టణంలో కురిసిన వర్షానికి వార సంతలో రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడ్డారు. గాధీగంజ్‌లో విక్రయానికి తెచ్చిన పంట ఉత్పత్తులు తడిసిపోకుండా టార్పాలిన్లు కప్పుకున్నారు. సోన్‌, లక్ష్మణచాంద మండలాల్లో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. సోన్‌ మండలంలో రాళ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు న్యూవెల్మల్‌ గ్రామ స్వాగత తోరణం కూలిపోయింది. లోకేశ్వరం మండలం రాజూరా, మన్మద్‌, పోట్‌పల్లి(ఎం), లోకేశ్వరం, పుస్పూర్‌, హవర్గ, సాథ్‌గాం, హద్దిగాం, బిలోలి గ్రామాల్లో వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. దస్తురాబాద్‌ మండలం రేవోజీపేట, బుట్టాపూర్‌, మల్లాపూర్‌, దస్తురాబాద్‌ ఈదురు గాలులతో కురిసిన ఆకాల వర్షానికి మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. ముధోల్‌తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలలతో వర్షం కురిసింది. పిప్రి గ్రామంలో రోడ్డుపై భారీ వృక్షం కూలింది. ఖానాపూర్‌ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. మామిడి పూత రాలిపోయింది.

నిర్మల్‌1
1/6

నిర్మల్‌

నిర్మల్‌2
2/6

నిర్మల్‌

నిర్మల్‌3
3/6

నిర్మల్‌

నిర్మల్‌4
4/6

నిర్మల్‌

నిర్మల్‌5
5/6

నిర్మల్‌

నిర్మల్‌6
6/6

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement