నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

నిర్మ

నిర్మల్‌

సోమవారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 8లోu నిర్మల్‌చైన్‌గేట్‌: అంగన్‌వాడీ కేంద్రాల భవనాల్లో ఇకనుంచి విద్యుత్‌ వెలుగులు విరజిమ్మనున్నాయి. జిల్లాలోని 4 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 930 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సొంత భవనాలు ఉన్నవి 181, అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి 370, రెంట్‌ ఫ్రీ భవనాలు 379 ఉన్నాయి. ఇందులో 380 భవనాలకు విద్యుత్‌ సరఫరా లేదు. ఇకపై ఈ కేంద్రాలకు కూడా విద్యుత్‌ సౌకర్యం కలుగనుంది. ఈ మేరకు మీటర్లు జారీ చేయాలని, విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని గత డిసెంబర్‌ మాసంలో టీజీఎన్పీడీసీఎల్‌ నుంచి జిల్లా విద్యుత్‌ ఎస్‌ఈ, డీఈలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంగన్‌వాడీ భవనాలకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఏటా వేసవిలో చిన్నారులు ఉక్కపోతతో అస్వస్థతకు గురైన ఘటనలు ఉన్నాయి. విద్యుత్‌ సరఫరాతో ఆ వెతలు తీరనున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా లేక ఏర్పడే ఇబ్బందులను పలు వురు డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారికి ప్రభుత్వం ఉచితంగానే సరఫరా చేస్తోంది. అంగన్‌వాడీ భవనాలకు కూడా జీరో బిల్లు (ఉచిత విద్యుత్‌) వర్తింపజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్పీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ మీటర్‌లను ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నారు. ఇక విద్యుత్‌ సరఫరా ఉన్న కేంద్రాల్లోనూ ఫ్యాన్లు లేవు. చిన్నారులు వేసవి తీవ్రత, ఉక్కపోత తట్టుకునేలా ఐసీడీఎస్‌ శాఖ అధికారులు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు, బాలింతలు, గర్భిణులు కోరుతున్నారు.

న్యూస్‌రీల్‌

ప్రక్రియ కొనసాగుతోంది

పై అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 381 ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు, రెంట్‌ ఫ్రీ భవనాలకు విద్యుత్‌ మీటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 290 భవనాలకు మీటర్లు బిగించాం. మరో వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. భవనాలకు విద్యుత్‌ సరఫరా చేయడంతో కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వేసవికాలంలో ఇబ్బందులు ఉండవు.

– శ్రీనివాస్‌, విద్యుత్‌ శాఖ ఏఈ

మొత్తం బిగించాల్సిన మీటర్లు : 381

ఇప్పటి వరకు బిగించినవి : 290

ఇంకా బిగించాల్సినవి : 91

నిర్మల్‌ కాన్‌స్టెన్సీ : 116

ఖానాపూర్‌ : 72

ముధోల్‌ : 102

బాసరలో భక్తుల రద్దీ
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర నుంచి తరలివచ్చారు.
అంగన్‌వాడీలకు వెలుగులు

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

నిర్మల్‌టౌన్‌: హైదరాబాద్‌లో జరుగుతున్న సీఎంకప్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఆదివారం జరిగిన పోటీల్లో జిల్లాకు మరిన్ని పతాకాలు లభించాయి. రిథమిక్‌ యోగా అండర్‌– 14 సబ్‌ జూనియర్స్‌ విభాగంలో మాగం చరణ్‌కు వెండి పతకం లభించింది. అండర్‌– 25 విభాగంలో దిలీప్‌ బంగారు పతకం సాధించాడు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి అభినందించారు.

జీరో బిల్లుతోనే సరఫరా..

నిర్మల్‌1
1/1

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement