పెన్షన్ ఇప్పించండి..
నేను పుట్టుకతోనే మూగవాడిని, నాకు చెవులు వినిపించవు. 18 నెలల క్రితం నా పెన్షన్ రద్దు అయింది. సదరన్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతీసారి నాకు సంవత్సరం మాత్రమే ఇస్తున్నారు. శాశ్వత సదరం సర్టిఫికెట్‌తో పాటు పెన్షన్ ఇప్పించండి. – పోశెట్టి, మామడ
క్రయ విక్రయాలు ఆపాలి..
నాకు మా అమ్మ అయిన పెంటు లసుంబాయి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి సర్వే నం.716ఆ, 4 గుంటల భూమి కడ్తాల్ శివారులో ఉంది. ఈ వ్యవసాయ భూమిని మా అమ్మకి తెలియకుండా ముద్దం చిన్నపోశెట్టి, ముద్దం బక్కన్న, గుర్తం లసుంబాయి కలిసి మేక శంకర్‌కు అమ్మేశారు. భూమిని మేము ఎవరికీ అమ్మలేదు. ఈ భూమి ప్రస్తుతం కోర్టు పరిధి లో ఉంది. క్రయ విక్రయాలు జరగకుండా చూడాలి. – పెంటు రాములు, బాగులవాడ
పెన్షన్ ఇప్పించండి..


