ప్రజావాణి.. ప్రయోజనమేమి?
నిర్మల్‌చైన్‌గేట్: తన కుమారులు అక్రమంగా భూమి ఆక్రమించారని, దివ్యాంగుల కింద వచ్చే పింఛన్ రావడం లేదని, కూలిన ఇంట్లో ఉంటున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని, పట్టా పాస్‌బుక్‌లో ఫొటో తప్పుగా పడిందని.. ఇలా పలు సమస్యలు పరిష్కారం కావడం లేదని, దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వస్తున్న జిల్లా ప్రజలు కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుని పోతున్నారు. పరిష్కారంపై ఎంతో నమ్మకంతో ఉంటున్నారు. కానీ, అధికారులు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. దరఖాస్తులు ఇచ్చుడే తప్ప పరిష్కారం కావడం లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు వారాల విరామం తర్వాత మళ్లీ సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. మొత్తం 91 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తుపై తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థలు, వస తి గృహాలు తనిఖీ చేయాలని సూచించారు వేసవి సమీపిస్తున్నందున విద్యార్థులకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నా రు. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన పనులు, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు, మండల ప్రత్యే క అధికారులు పరిశీలిస్తూ, నిర్మాణాల ప్రగతి, నాణ్య త పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


