అరైవ్.. అలైవ్
22న ప్రచారం ప్రారంభం, అవగాహన దినం. రోడ్డు భద్రతపై సిబ్బంది బ్రీఫింగ్, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం.
23న లేన్ డిసిప్లీన్ డ్రైవ్ దినం. తప్పుగా ఓవర్‌టేకింగ్ తనిఖీ, ఎడమ లేన్ డ్రైవింగ్ అమలు చేయడం.
24న హెల్మెట్ అమలు కార్యక్రమం. హెల్మెట్ తనిఖీ డ్రైవ్‌లు, పాఠశాలలు, మార్కెట్ల వద్ద అవగాహన కల్పించడం.
25న సీట్‌బెల్ట్ అమలు కార్యక్రమ దినం. ప్రధాన కూడళ్లలో నాలుగు చక్రాల వాహనాల తనిఖీలు చేయడం.
26న మద్యం సేవించి వాహనం నడపడం నిరోధ దినం. రాత్రి పూట ప్రత్యేక డ్రైవ్‌లు, బ్రీత్‌ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తారు.
27న కంటి పరీక్ష శిబిరాల దినం. భారీ వాహన డ్రైవర్లకు శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, కళ్లజోళ్లు పంపిణీ చేయడం.
28న డిఫెన్సివ్ డ్రైవింగ్ అవగాహన, ముగింపు దినం. అవగాహన సమావేశాలు, పీపీటీ కార్యక్రమాలు నిర్వహించడం.
నిర్మల్‌టౌన్: రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా జిల్లా పోలీసులు ‘అరైవ్.. అలైవ్’ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నా రు. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జి ల్లాలోని ప్రజల ప్రాణాలు, భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఈ నెల 22 నుంచి వారం రోజులపా టు కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహ న పెంపొందించడం, సురక్షిత ప్రయాణం అభివృద్ధి చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
రోజువారీ అవగాహన కార్యక్రమాలు
రోడ్డు ప్రమాదాల తగ్గింపే లక్ష్యం
అరవ్ అలైవ్ కార్యక్రమం ముఖ్య లక్ష్యం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే. రోడ్డు ప్ర మాదాల్లో ఏటా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంట్లో ఎదురుచూస్తున్న వారి కోసం అయినా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మద్యం సేవించి వాహనం నడపకూడదు. నడిపితే వారితో పాటు ఇతరులకూ నష్టం జరుగుతుంది. – జానకీ షర్మిల, ఎస్పీ
అరైవ్.. అలైవ్


