ఒత్తిడి వద్దు.. లక్ష్యమే ముద్దు | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడి వద్దు.. లక్ష్యమే ముద్దు

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

ఒత్తిడి వద్దు.. లక్ష్యమే ముద్దు

ఒత్తిడి వద్దు.. లక్ష్యమే ముద్దు

● ఈ నెల 25 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ● హాజరుకానున్న 13,125 మంది విద్యార్థులు ● వార్షిక పరీక్షల సమయంలో ప్రతీ నిమిషం కీలకమేనని, రోజులో నిద్ర, ఇతర పనులకు పోనూ మిగిలిన సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని విషయ నిపుణులు సూచిస్తున్నారు. ● ఏ పాఠ్యాంశం వదలకుండా ప్రతీ దానిని క్షుణ్ణంగా చదవాలి. ● చదివిన ప్రతీ పాఠ్యాంశం పునశ్ఛరణ చేసి అన్నింటిపై పట్టు సాధించాలి. ● అనుకున్న లక్ష్యం సాధించేందుకు కఠిన సాధన చేయాలి. ● పరీక్షల సమయంలో ప్రధానంగా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ● పరీక్షలు అనగానే విద్యార్థులు భయాందోళన చెందడం సహజం. కానీ భయాన్ని వీ డాలి.. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలి.. ధైర్యం కోల్పోకుండా సానుకూల దృక్పధంతో చదివితే ఉ త్తమ మార్కులు సాధించే అవకాశం ఉంది. ● పరీక్షల సమయంలో విద్యార్థులు మొబైల్‌ ఫోన్‌లకు, సామాజిక మాధ్యమాలకు దూర ంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

లక్ష్మణచాంద: ఇంటర్‌ వార్షిక పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థుల్లో ఇప్పటికే కొంత ఆందోళన మొదలైంది. అలాగే తమ పిల్లలు మంచి మార్కులు సాధిస్తారా? లేదా అనే సందేహం కూడా తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఒత్తిడిని జయించి ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని విషయ నిపుణులు, మానసిక వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

ప్రతీ నిమిషం ముఖ్యమే...

జిల్లాలో ఇలా...

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, మోడల్‌, అన్ని రకాల రెసిడెన్షియల్స్‌ జూనియర్‌ కళాశాలలు 69 ఉన్నాయి. ఇందులో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 6,652 మంది, ద్వితీయ సంవత్సరం 6,473 మంది మొత్తంగా 13,125 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement