తప్పని యూరియా తిప్పలు
ఖానాపూర్: రైతులకు యూరియా కష్టాలు దూరం చేసేందుకు ప్రభుత్వం యాప్‌లో బుకింగ్ పద్ధతి ప్రవేశపెట్టినప్పటికీ తిప్పలు తప్పడంలేదు. పట్టణంలోని గ్రోమోర్ ఫర్టిలైజర్స్ యాప్‌లో బుక్ చేసిన రైతులు యూరియా బస్తాల కోసం రెండు రోజులుగా షాపు వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం లేక పలువురు రైతులు సకాలంలో యూరియా బుక్ చేసుకోలేక పోతుండగా బుక్ చేసినా బస్తాలకోసం రెండు రోజులుగా తిరగాల్సి వస్తోందని మామడ మండలంలోని పొన్‌కల్ గ్రామానికి చెందిన రైతులు అశోక్, శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా యాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు ఫోన్‌చేసి ఓటీపీ ఎంటర్ చేసి ఆన్‌లైన్ ప్రక్రియ చేయడంతో ఆలస్యం జరుగుతోందని గ్రోమోర్ నిర్వాహకులు పేర్కొన్నారు.
తప్పని యూరియా తిప్పలు


