● మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ● 18 సంఘాలకు నిధులు మంజూరు ● ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున.. ● డీడీలు చెల్లించిన అధికారులు ● ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

● మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ● 18 సంఘాలకు నిధులు మంజూరు ● ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున.. ● డీడీలు చెల్లించిన అధికారులు ● ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్రణాళిక

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

● మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ● 18 సంఘాలకు నిధులు మంజ

● మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ● 18 సంఘాలకు నిధులు మంజ

● మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ● 18 సంఘాలకు నిధులు మంజూరు ● ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున.. ● డీడీలు చెల్లించిన అధికారులు ● ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్రణాళిక

నిర్మల్‌చైన్‌గేట్‌: మహిళా సంఘాల ను ఆర్థికంగా బలోపే తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందిరా శక్తి పథకం కింద మహిళా సంఘాల సభ్యులను బస్సులకు యజమానులను చేస్తోంది. మొదటి విడతలో జిల్లాకు అవకాశం దక్కనప్పటికీ రెండో విడతలో అన్ని మండల సమాఖ్యలకు అవకాశం లభించింది. మహిళా దినోత్సవం రోజున 18 మహిళా సమాఖ్యలకు బస్సులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మండలానికి ఒకటి చొప్పున...

జిల్లాలో 18 మండలాలకుగానూ 18 మహిళా సమాఖ్యలు ఉన్నాయి. ఒక్కో సమాఖ్యలో 700 నుంచి 1,100 మంది సభ్యులు ఉంటారు. ఇందులో భాగంగా బస్సుల కొనుగోలు కోసం ప్రతిపాదనలు త యారు చేశారు. ఒక్కో బస్సుకు రూ.36 లక్షల విలు వ ఉండటంతో సెర్ప్‌ నుంచి రూ.30 లక్షలు, మిగతా రూ.6 లక్షలను మండల సమాఖ్య నుంచి లేదా బ్యాంకు నుంచి రుణం తీసుకుని చెల్లించనున్నారు. 18 సంఘాలకు నిధులు మంజూరయ్యాయి. బస్సుల కొనుగోలుకు డీడీలు కూడా చెల్లించారు.

ప్రతీనెల మొదటివారంలో అద్దె..

బస్సులు కొనుగోలు చేసిన తర్వాత ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందజేస్తారు. మండల మహిళా స మాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఏడేళ్లలో తిరి గి ఇస్తారు. ఒక్కో బస్సుకు ఆర్టీసీ ప్రతీనెల మొదటి వారంలో అద్దె రూ.69,468 చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. ఈ మొత్తం సెర్ప్‌ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ కింద మండల ఖాతాలో జమవుతుంది. ఈ మొత్తాన్ని మహిళా సంఘాల్లోని సభ్యుల అభ్యన్నతికి వినియోగిస్తారు.

సంస్థపై తగ్గనున్న ఒత్తిడి..

ఇప్పటి వరకు ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకు తీసుకుని ఆర్టీసీ నిర్వహిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అందించేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అదనంగా బస్సుల అవసరం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు సమకూరడంతో ఆర్టీసీపై ఒత్తిడి తగ్గనుంది. కొత్త బస్సులతో ప్రయాణికులకు సైతం సౌకర్యం కలగనుంది.

ప్రతీ మండల మహిళా సమాఖ్యకు ఒక్కో బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల కొనుగోలుకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) వద్ద ఉండే కమ్యూనిటీ నుంచి నిధులు విడుదల చేసింది. బస్సుల అద్దైపె ఇప్పటికే ఆర్టీసీతో సెర్ప్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

పొదుపు నుంచి వ్యాపార రంగాల్లోకి..

పొదుపు నుంచి మహిళలు వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. చిన్న

తరహా పరిశ్రమల స్థాపనతో

కొంత ఉపాధి పొందుతున్నారు. అతివలకు రెట్టింపు ఆదాయం పెంచేందుకు మహిళా శక్తి క్యాంటీన్‌, పెరటికోళ్ల పెంపకం, పాడి గేదెలు ఇలా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా నెలకు రూ.69వేల అద్దెను ఆర్టీసీ యాజమాన్యం చెల్లించనుంది. దీంతో మహిళా సమాఖ్యకు మరింత ఆదాయం పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement