ఆదాయం ఉన్నా.. సౌకర్యాలు సున్న..!
భైంసాటౌన్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన బైల్ బజార్‌లో అసౌకర్యాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశువుల క్రయవిక్రయాలతో ఏఎంసీకి ఆదాయం చేకూరుతున్నా.. రైతులు కూర్చునేందుకు నీడ, తాగునీరు వసతి కల్పించడం లేదు. ప్రతీ మంగళవారం నిర్వహించే బైల్ బజార్‌కు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతులు తమ పశువులను విక్రయించేందుకు వస్తుంటారు. క్రయవిక్రయాలను బట్టి ఏఎంసీకి రుసుం చెల్లిస్తారు. దీంతో నెలకు రూ.50 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. కానీ, నిర్వహణను పట్టించుకోకపోగా, రైతులకు వసతులు కల్పించడం లేదు. బైల్ బజార్ చుట్టూ ఉన్న ప్రహరీ కూలిపోయింది. బజార్ ప్రాంగణంలోని సిబ్బంది గదులు, ఇతర గదులు శిఽథిలదశకు చేరుకున్నాయి. లోపలికి, బయటకు వచ్చే మార్గాల్లో గేట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గదులకు ఉన్న కిటికీలు, తలుపులను చోరీ అయ్యాయి. ఏఎంసీ అధికారులు పట్టించుకుని, బైల్ బజార్‌లో సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఆదాయం ఉన్నా.. సౌకర్యాలు సున్న..!


