అడెల్లికి పోటెత్తిన భక్తజనం
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్‌తోపాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో భూమయ్య, చైర్మన్ భోజాగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అత్యవసర వైద్యసేవల నిమిత్తం 108 అంబులెన్స్ అందుబాటులో ఉంచారు.
‘అడెల్లి’లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పూజలు
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని ఆదివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ భోజాగౌడ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను సత్కరించారు.
అడెల్లికి పోటెత్తిన భక్తజనం


