ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్
భైంసాటౌన్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ మండిపడ్డారు. పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో అక్కడి బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్‌పై జరిగిన దాడికి నిరసనగా సంఘీభావం తెలిపేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. కుంటాల మండలంలోని ఓలాలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు వస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు తూప్రాన్‌లో అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అనంతరం తన కారులో కామారెడ్డి వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కార్యక్రమంలో భైంసా ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేశ్‌బాబు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాము, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


