విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి
లక్ష్మణచాంద: పదోతరగతి విద్యార్థులు సరైన లక్ష్యంతో ముందుకెళ్లాలని డీఈవో భోజన్న సూచించారు. గురువారం సోన్ మండలంలో ని న్యూవెల్మల్ బొప్పారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల జీవితాల్లో పదోతరగి అత్యంత కీలకదశ అన్నారు. ఈ దశలో క్రమశిక్షణ, ప ట్టుదల, సమయపాలన, గురువుల మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో న్యూవెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, బొప్పారం సర్పంచ్ దేశెట్టి నరేష్, ఎంఈవో తోడిశెట్టి పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్ పాల్గొన్నా రు.


