కోవూరు : గ్యాస్ లేని ప్రతి కుటుంబానికి ఉచితంగా కనెక్షన్ మంజూరు చేస్తామని ఎన్‌ఆర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహుకులు నజీర్ అహ్మద్ తెలిపారు.
ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్
Jul 20 2016 4:53 PM | Updated on Sep 4 2017 5:29 AM
కోవూరు : గ్యాస్ లేని ప్రతి కుటుంబానికి ఉచితంగా కనెక్షన్ మంజూరు చేస్తామని ఎన్‌ఆర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహుకులు నజీర్ అహ్మద్ తెలిపారు. స్థానిక ఏజెన్సీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ పరిధిలో పొగరహిత వంట కోసం అందరికి సిలిండర్లు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో మీ–సేవ కేంద్రంలో నమోదు చేసుకుని తహసీల్దారు కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. కనెక్షన్ లేనివారు ఇప్పుడే నేరుగా ఆన్‌లైన్‌లో ఈపీడీఎస్ సైట్‌లో వివరాలు నమోదుచేసి ఏజెన్సీ వద్దకు వస్తే మంజూరవుతుందన్నారు.
Advertisement
Advertisement