ఛాతీలో మంట... కడుపులో యాసిడ్‌ పైకి తంతుంటే! 

Gastric Problem Causes and Treatment - Sakshi

ఎంత ఆరోగ్యవంతులకైనా జీవితంలో ఎప్పుడో ఒకసారైనా కడుపులోని గ్యాస్‌ పైకి ఎగజిమ్ముతూ... ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వస్తుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌’ (జీఈఆర్‌డీ) అంటారు. కడుపులో యాసిడ్‌ ఆహారంపైన పనిచేసే సమయంలో దాని వాయువులు (ఫ్యూమ్స్‌) పైకి ఎగజిమ్మడంతో గొంతు, ఛాతీలో మంట అనిపిస్తుంది.

జీఈఆర్‌డీని నివారించాలంటే... ఈ సమస్య నివారణకు మంచి జీవనశైలిని అలవరచుకోవడం మేలు.
రాత్రి భోజనం ఆలస్యం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరమైనా నడవాలి.
► పక్కమీదకు చేరగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. ఒకవేళ కుడివైపు తిరిగి పడుకుంటే గొంతు చివర అన్నకోశం దగ్గర ఉండే స్ఫింక్టర్‌ మీద ఒత్తిడి పడి తెరుచుకుని, ఆహారం వెనక్కు  రావచ్చు. అప్పుడు యాసిడ్‌ కూడా వెనక్కు వచ్చే అవకాశముంటుంది. 
► తల వైపు భాగం ఒంటి కంటే కాస్త ఎత్తుగా ఉండేలా పక్కను సర్దుకోవాలి. రిఫ్లక్స్‌ సమస్యతో బాధపడేవారు వీలైతే తల కింద మరో దిండును ఎక్కువగా పెట్టుకోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది.
మందుల విషయానికి వస్తే... హెచ్‌2 బీటా బ్లాకర్స్, ప్రోటాప్‌ పంప్‌ ఇన్హిబిటర్స్‌ (పీపీఐ) అనే మందులతోనూ చికిత్స చేస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top