పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర, సోషల్‌ మీడియాలో మీమ్స్‌ మంట!

LPG price hiked again, cylinder rates cross Rs1000 - Sakshi

ఉప్పు నుంచి పప్పు దాకా..పెట్రోల్‌ నుంచి నిత్యవసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని బూచీగా చూపిస్తూ ఉత్పత్తి దారులు అన్నీ రకాల వస్తుల ధరల్ని పెంచడంతో..ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. తాజాగా ఇవేం సరిపోవన్నట్లు గ్యాస్‌ కంపెనీలు సైతం గ్యాస్‌ ధరల్ని పెంచి సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపించాయి. దీంతో  పెరిగిన ధరలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదైన స్టైల్లో మీమ్స్‌ వేస్తున్నారు. ట్రెండ్‌ అవుతున్న మీమ్స్‌ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

గురువారం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.3.50పైసలు పెరగ్గా..కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.8 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన  నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో గ్యాస్‌ సిలిండర్‌ ధర  రూ.1000 దాటడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన సిలిండర్‌ ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

ఇవ్వాళ పెరిగిన ధరలతో ఢిల్లీలో 14.2కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1,003, కోల్‌ కతాలో 1,029.50, ముంబైలో రూ.1,003, చెన్నైలో రూ.1,019 ఉంది

19కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.2,254, కోల్‌కతాలో రూ.2,453, ముంబైలో రూ.2,305, చెన్నైలో రూ.2,507గా ఉంది. 

విమర్శల వెల్లువ 
పెరిగిన గ్యాస్‌ ధరలపై నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.రోజురోజుకీ పెరిగిపోతున్న గ్యాస్‌ ధరలు మధ్య తరగతి ప్రజల ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు రూ.414..ఇప్పుడు 
ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.3.50, కమర్షియల్‌ సిలిండర్‌ రూ.8 పెరగడంపై కాంగ్రెస్‌ పార్టీ మహిళా ప్రతినిధి శర్మ డాక్టర్ షామా మొహమ్మద్ కేంద్రంపై మండిపడ్డారు. మే 2014 కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఇదే గ్యాస్‌ ధర రూ.414  ఉంటే.. ఇప్పుడు రూ.1,003 ఉందని ట్వీట్‌ చేశారు.

  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top